Gang leader: నేనే గ్యాంగ్ లీడర్, ఆరు మందిలో గొడవ, రౌడీని నరికి చంపేసిన క్లోజ్ ఫ్రెండ్స్ !
చెన్నై/ తిరుప్పూర్: జలాయిగా తిరుగుతున్న యువకులు సెటిల్ మెంట్లు, దందాలు, మామూళ్లు వసూలు చేసి జల్సా చేస్తున్నారు. ఆరు మంది యువకులు గ్యాంగ్ గా ఏర్పడి అనుచరులను వెంట పెట్టుకుని రెచ్చిపోతున్నారు. అయితే ఆరు మందిలో ఇద్దరు గ్యాంగ్ లీడర్ కావాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్లలో ఓ యువకుడు నేనే మీకు బాస్ అంటూ రెచ్చిపోవడంతో అతని స్నేహితుల చేతిలోనే దారుణ హత్యకు గురైనాడు.
తమిళనాడులోని తరుప్పూర్ నగరంలోని సెవంతపాళ్యంలోని జీవానగర్ లో సురేష్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సురేష్ స్నేహితులు మణికందన్, మోహన్ రాజ్, గుణ, అరివుప్రకాష్, ప్రవీణ్ కుమార్ లు ఉన్నారు. ఈ ఆరు మంది స్నేహితులు చాలాక్లోజ్ గా ఉంటున్నారు. చిన్నపటి నుంచి స్నేహితులు అయిన ఆరు మందికి నేర చరిత్ర ఉంది.

సురేష్, మణికందన్, మోహన్ రాజ్, గుణ, అరివుప్రకాష్, ప్రవీణ్ కుమార్ ల మీద తిరుప్పూర్ లో అనేక కేసులు నమోదు కావడంతో కొన్ని కేసులో కోర్టులో విచారణలో ఉన్నాయి. రాత్రి అందరూ బార్ లో మద్యం సేవించడానికి వెళ్లారు. ఆ సందర్బంలో సురేష్ పీకలదాక తాగేసి సాటి స్నేహితుల మీద కేకలు వేశాడు.
ప్రతిరోజు నేను మీకు వేలు వేలు ఖర్చు చేస్తున్నానని, అడిగినప్పుడు డబ్బులు ఇస్తున్నానని, మద్యం తీసిస్తున్నానని, ఇక ముందు నేనే మీకు బాస్, నేను చెప్పినట్లు మీరు వినాలి అని చెప్పాడు. ఆ సందర్బంలో బార్ లోనే సురేష్ తో ఐదు మంది స్నేహితులు గొడవ చేశారు. తరువాత బార్ లో నుంచి బయటకు వచ్చేశారు.
అక్కడ మళ్లీ గొడవ జరగడంతో ఐదు మంది స్నేహితులు కలిసి వేటకొడవళ్లు తీసుకుని సురేష్ ను దారుణంగా నరికి స్పాట్ లో చంపేశారు. గ్యాంగ్ లీడర్ ఎవరు అనే విషయంలో స్నేహితుల మద్య గొడవ జరిగి రౌడీషీటర్ హత్యకు గురి కావడంతో తిరుప్పూర్ లో కలకలం రేపింది. సురేష్ ను హత్య చేసిన ఐదు మంది పరారైనారని పోలీసులు అన్నారు.












Click it and Unblock the Notifications