అమానవీయం: డాల్ఫిన్‌ను అత్యంత కిరాతకంగా చంపేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ డాల్ఫిన్‌ను కొందరు దుండగులు కర్రలు, రాడ్లతో కిరాతకంగా కొట్టి చంపారు. ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Recommended Video

ఈ దారుణ ఘటన డిసెంబర్ 31న జరిగిందని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టినట్లు పోలీసులు తెలిపారు. గాంగెటిక్ అనేది డాల్ఫిన్ కు రక్షిత ప్రదేశమని తెలిపారు. అత్యంత దారుణంగా డాల్పిన్‌ను కొట్ట చంపారని తెలిపారు. కొందరు డాల్ఫిన్‌ను నీటిలో అదిమి పట్టగా.. మరికొందరు కర్రలు, రాడ్లతో కొట్టిచంపారు.

కొందరు ఆ దుర్మార్గులను ఆపేందుకు ప్రయత్నించినా వారు వినిపించుకోకుండా డాల్ఫిన్‌ను చంపేశారు. డాల్ఫిన్ శరీరం నుంచి రక్తం కారుతున్నా ఏ మాత్రం కనికరం లేకుండా పాశవికంగా ప్రవర్తించారు.
అటవీశాఖ అధికారులకు సమాచారం రంగంలోకి దిగిన అధికారులు.. చనిపోయిన డాల్ఫిన్‌ను కాలువ ఒడ్డున గుర్తించారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనకు కారణం ఎవరని అక్కడివారిని ప్రశ్నించారు. అయితే, ఎవరూ కూడా వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం.
ఇక ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగానే కేసు నమోదు చేసిన అధికారులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. డాల్ఫిన్‌కు తీవ్రగాయాలయ్యాయని, లోతైన గాయాలయ్యాయని వివరించారు.












Click it and Unblock the Notifications