Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైళ్ళలో చెత్త ట్రాక్ లపై పడేయకుండా మార్గదర్శకాలు.. అలా చేస్తే వారికి షాక్!

రైలు ప్రయాణికులకు ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న భారతీయ రైల్వే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో చెత్త తొలగింపుపై నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన రైల్వే రైళ్ళలో హౌస్ కీపింగ్ మరియు ప్యాంట్రీ కార్ సిబ్బందికి కీలక సూచనలు చేసింది.

వారికి చెత్త సేకరణ, డిస్పోజల్ పై శిక్షణ
రైలు ప్రయాణ సమయంలో రైళ్లను శుభ్రంగా ఉంచటం కోసం హౌస్ కీపింగ్ మరియు ప్యాంట్రీ కార్ సిబ్బంది నిర్దేశించిన విధానంలోనే చెత్తను సేకరించాలని పేర్కొంది. నిర్దేశించిన స్టేషన్లోనే సురక్షితంగా దానిని పారవేయాలి అని ఆదేశించింది. రైల్వే ట్రాక్ల పైన చెత్త పడేయకూడదని స్పష్టం చేసింది. ఆన్ బోర్డు హౌస్ కీపింగ్ సిబ్బందికి చెత్త సేకరణ మరియు, చెత్త డిస్పోజల్ పైన శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించింది.

Garbage disposal guidelines on trains shock for obhs and pantry car staff

Take a Poll

రైళ్ళలో పరిశుభ్రతకు మార్గదర్శకాలు
పరిశుభ్రతపైన అవగాహన కల్పించడం కోసం సంవాద్ పేరుతో చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఇండియన్ రైల్వే పేర్కొంది. రైళ్లలో పరిశుభ్రత ప్రమాణాలను పెంచడానికి, రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు భారతీయ రైల్వే పేర్కొంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ బృందాలు ప్యాంట్రీ కార్ సిబ్బంది చెత్త విషయంలో ఇలా చెయ్యాలి.

నిర్దేశించిన స్టేషన్లలో సీల్ చేసిన సంచులలో చెత్త జమ చెయ్యాలి
ప్రయాణికులకు టాయిలెట్ల వద్ద ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ ల నుండి వ్యర్ధాలను సేకరించి ఆ రైలు ప్రయాణించే మార్గంలో పేర్కొన్న స్టేషన్లలో సీల్ చేసిన సంచులలో జమ చేయాలి. రైళ్ల లోపల పరిశుభ్రతను కాపాడుకోవడంతో పాటు, ట్రాక్ల పైన కూడా చెత్త పడేయకుండా చూడడంలో భాగంగా, స్టేషన్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో భాగంగా ఈ విధానం అవసరమని రైల్వే బోర్డు పేర్కొంది.

వ్యర్ధాల నిర్వహణ సరిగ్గా చెయ్యకుంటే కాంట్రాక్ట్ ఉల్లంఘనగా పరిగణన
స్వచ్ఛభారత్ మిషన్ కింద ఈ వ్యర్ధాల నిర్వహణ పైన ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తారు. చెత్త నిర్వహణ పద్ధతులపైన, వీడియోలు ద్వారా వీరికి బోధన చేస్తారు. ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ బృందాలకు, ప్యాంట్రీ కార్ సిబ్బందికి ఈ మార్గదర్శకాలను పాటించడం తప్పనిసరి. ఒప్పందంతో పనిచేసే వీరంతా ఈ మార్గదర్శకాలను పాటించకపోతే, ఏదైనా ఉల్లంఘన జరిగినట్టుగా రైల్వే భావిస్తే అది వారికి సంబంధించిన కాంట్రాక్ట్ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.

కాంట్రాక్ట్ రద్దయ్యే ఛాన్స్
కఠిన చర్యలలో భాగంగా వారి కాంట్రాక్ట్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా రైల్వే తీసుకునే నిర్ణయం రైల్వే స్టేషన్లను, రైల్వే ట్రాక్లను, రైళ్ళను కూడా పరిశుభ్రంగా ఉంచుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే రైల్వే ఇచ్చిన తాజా మార్గదర్శకాలతో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ బృందాలు, ప్యాంట్రీ కార్ సిబ్బందిపై భారం పెరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+