Gas: శుభకార్యంలో గ్యాస్ సిలిండర్లు ?, 11 మంది మృతి, సీమంతం టైమ్ లో దారుణం, కేసు మాత్రం !
బెంగళూరు/ యాదగిరి: మహిళ సీమంతం చెయ్యాలని ఆమె భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యుల నిర్ణయించారు. బంధువులు, స్నేహితులు, ఊరివాళ్లు అందరిని సీమంతం శుభకార్యానికి పిలిచారు. సీమంతం శుభకార్యానికి హాజరయ్యే వారి కోసం వంటలు చెయ్యడానికి మహిళ కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వాళ్ల దగ్గర గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చారు. సీమంతం శుభకార్యానికి బంధువులు, తెలిసిన వాళ్లు చాలా మంది హాజరైనారు. ఆ సమయంలో గ్యాస్ సిలిండర్లు నుంచి గ్యాస్ లీక్ అయ్యి పేలిపోవడం కలకలం రేపింది. సీమంతానికి హాజరైన 24 మందికి పైగా తీవ్రగాయాలైనాయి. తీవ్రగాయాలైన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. చికిత్స విఫలమై ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నాసిరకమైన గ్యాస్ సిలిండర్లు సరఫరా చెయ్యడం వలనే ఈ దారుణం జరిగిందని బాధితుల కుటుంబ సభ్యులు అంటున్నారు. గ్యాస్ కంపెనీ మీద కాకుండా గ్యాస్ సరఫరా చేసే వ్యక్తి మీద, గ్యాస్ ఏజెన్సీ నిర్వహకుడి మీద మాత్రమే కేసు నమోదు చేసిన పోలీసులు తూతూ మంత్రంగా కేసు విచారణ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

సీమంతం చెయ్యాలని ఏర్పాట్లు
కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని శాహాపుర తాలుకాలోని దోరనహళ్ళి గ్రామంలో నివాసం ఉంటున్న మహిళ గర్బవతి అయ్యింది. మహిళ సీమంతం చెయ్యాలని ఆమె భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యుల నిర్ణయించారు. బంధువులు, స్నేహితులు, ఊరివాళ్లు అందరిని సీమంతం శుభకార్యానికి పిలిచారు.

గ్యాస్ సిలిండర్లు
సీమంతం శుభకార్యానికి హాజరయ్యే వారి కోసం వంటలు చెయ్యడానికి మహిళ కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వాళ్ల దగ్గర గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చారు. సీమంతం శుభకార్యానికి బంధువులు, తెలిసిన వాళ్లు చాలా మంది హాజరైనారు. ఆ సమయంలో గ్యాస్ సిలిండర్లు నుంచి గ్యాస్ లీక్ అయ్యి పేలిపోవడం కలకలం రేపింది.

11 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి
సీమంతానికి హాజరైన 24 మందికి పైగా తీవ్రగాయాలైనాయి. తీవ్రగాయాలైన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. చికిత్స విఫలమై ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నాసిరకమైన గ్యాస్ సిలిండర్లు సరఫరా చెయ్యడం వలనే ఈ దారుణం జరిగిందని బాధితుల కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఇద్దరి మీద మాత్రమే కేసు నమోదు
గ్యాస్ కంపెనీ మీద కాకుండా గ్యాస్ సరఫరా చేసే వ్యక్తి మీద, గ్యాస్ ఏజెన్సీ నిర్వహకుడి మీద మాత్రమే కేసు నమోదు చేసిన పోలీసులు తూతూ మంత్రంగా కేసు విచారణ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇండియన్ గ్యాస్ యాజమాన్యం మీద కేసు నమోదు చెయ్యలేదని, పోలీసుల మీద ఒత్తిడి ఎక్కువగా ఉందని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది ?, న్యాయ విచారణకు డిమాండ్
మేము నాసిరకంగా సిలిండర్లు సరఫరా చెయ్యలేదని, ఎక్కడో ఏదో తేడా వచ్చిందని గ్యాస్ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అయితే 11 మంది చనిపోవడానికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సీమంతం జరిగే సమయంలో గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో తీవ్రగాయాలైన 24 మందిలో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications