తనను ఒకరు ఫాలో అవుతున్నట్లు గుర్తించిన గౌరీ లంకేష్, ట్విస్ట్‌లు
గుర్తు తెలియని వ్యక్తులు తనపై నిఘా పెట్టారని ఇటీవల మృతి చెందిన కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ముందే గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె తల్లి వెల్లడించారు. కానీ, తనను చంపేంత ప్రమాదం ఉందని ఆమె గుర్తించలేదని తెల
బెంగళూరు: గుర్తు తెలియని వ్యక్తులు తనపై నిఘా పెట్టారని ఇటీవల మృతి చెందిన కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ముందే గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె తల్లి వెల్లడించారు. కానీ, తనను చంపేంత ప్రమాదం ఉందని ఆమె గుర్తించలేదని తెలుస్తోంది.
గౌరీ లంకేష్ సెప్టెంబర్ 2వ తేదీన తన సోదరి ఇంటికి వెళ్లారు. తనను ఒకరు ఫాలో అవుతున్నట్లు తన కూతురు చెప్పిందని గౌరీ లంకేష్ తల్లి చెప్పారు. అయితే, మేము కానీ గౌరీ లంకేష్ కానీ దీనిని అంత సీరియస్‌గా తీసుకోలేదని చెప్పారు.

కచ్చితంగా తెలియదని..
అదే సమయంలో గౌరీ లంకేష్‌ను చంపేసింది, ఆమెను అనుసరించిన వ్యక్తేనా, కాదా తాము కచ్చితంగా చెప్పలేమని ఆ తల్లి చెప్పారు. గౌరీని నిందితులు 7.65 ఎంఎం పిస్టల్‌తో కాల్చి చంపిన విషయం తెలిసిందే.

ఆధారాలు ఇస్తే రూ.10 లక్షల నజరానా
ఇదిలా ఉండగా గౌరీ లంకేష్ హత్య కేసు విచారణలో కీలకమైన ఆధారాలు ఇచ్చిన వారికి రూ.10 లక్షల అవార్డు ఇవ్వనున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే సిట్ వేశారు. మరోవైపు, తమకు కర్నాటక ప్రభుత్వంపై నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరిపించాలని రెండు రోజుల క్రితం గౌరీ లంకేష్ సోదరుడు విజ్ఞప్తి చేశారు.

గౌరీ లంకేష్ హత్య కేసులో ట్విస్ట్‌లు
గౌరీ లంకేష్ హత్యకు హిందుత్వ శక్తులు కారణమని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె నక్సలైట్ల నుంచి కూడా హేట్ లెటర్స్ అందుకున్నారు. ఆమె తీరుపై అసంతృప్తిగా ఉన్న కొందరు నక్సలైట్ల నుంచి ఆమెకు లేఖలు అందాయని తెలుస్తోంది.

అందుకే అసంతృప్తి
గౌరీ లంకేష్‌కు హెట్ మెయిల్స్, హేట్ లేఖలు వచ్చాయని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. అందుకు కారణం కూడా ఉందన్నారు. పలువురు నక్సలైట్ల సరెండర్‌కు ఆమె కారణమని కొందరు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సిట్ పలు కోణాల్లో దర్యాఫ్తు చేస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications