ఫ్యామిలీ ఫోటోలు గుర్తించిన పాక్‌లోని గీత, బీహార్‌లో..
కరాచీ: పన్నెండేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్తాన్‌కు వెళ్లిన గీత అనే బాలిక ఎట్టకేలకు తన కుటుంబ సభ్యుల ఫోటోలను గుర్తించింది. పాకిస్తాన్‌లో ఉంటున్న భారత్‌కు చెందిన గీత తన కుటుంబ సభ్యులను గుర్తించడంతో ఆమెను అధికారులు స్వదేశానికి తీసుకు రావాలని భావిస్తున్నారు.
ఆమె తన తల్లిదండ్రులగా బీహార్‌కు చెందిన కుటుంబానికి చెందిన ఫోటోలను గుర్తించారు. గీత తన తండ్రి, సవతి తల్లి, తోబుట్టువులు తదితరుల ఫోటోలను గుర్తించింది. ఇస్లామాబాదులోని ఇండియన్ హైకమిషనర్ దీనిని వెల్లడించింది. వారు బీహార్‌లో నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, పాకిస్థాన్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉన్న భారత దేశానికి చెందిన మూగ, చెవిటి యువతి గీత.. తన నిజమైన తల్లిదండ్రులెవరో తెలుసుకునేందుకు అంతకుముందు డీఎన్‌ఏ పరీక్షలకు కూడా సిద్ధమైంది.

పన్నెండేళ్ల క్రితం తప్పిపోయిన గీత తమ కూతురేనని భారత్‌లోని ఐదు కుటుంబాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో తన నిజమైన తల్లిదండ్రులెవ్వరో తెలుసుకునేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారని గీత తరఫు న్యాయవాది, హర్యానాకు చెందిన సామాజిక కార్యకర్త మోమినీన్ మాలిక్ ఇటీవల తెలిపారు.
త్వరితగతిన ఆమె అప్పగింత కోసం భారత ప్రభుత్వం చొరవ చూపడం లేదని బుధవారం సింధ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫైసల్ అరబ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు నెల పదిహేను రోజుల క్రితం చెప్పారు. పాకిస్థాన్ సీఆర్‌పీసీలోని 552 సెక్షన్ ప్రకారం మాలిక్ పిటిషన్ దాఖలు చేశారు.
గత 12 ఏళ్లుగా గీత పాకిస్థాన్‌లోని ఈధి ఫౌండేషన్ సంస్థ సంరక్షణలో ఉన్నారు. గీతను తన సంరక్షణలోకి ఇవ్వాలని కోరుతూ అంతకుముందు భారత్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కరాచీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications