బెంగళూరు బస్టాండ్ టాయ్ లెట్ లో..: కలకలం- బిత్తరపోయిన పోలీసులు
సిలికాన్ సిటీ బెంగళూరులో కలకలం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కదలికలపై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, పోలీసులు పెద్ద ఎత్తున నిఘా పెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో- బెంగళూరు బస్టాండ్ లో పేలుడు పదార్థాలు కనిపించడం ఉలిక్కిపడేలా చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన కళాసిపాళ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (BMTC)కి బస్టాండ్ టాయ్ లెట్ లో ఆరు జిలెటిన్ స్టిక్స్, కొన్ని డిటోనేటర్లను గుర్తించడం కలకలం రేపింది. ఉద్రిక్తతలకు దారి తీసింది.

రెండు వేర్వేరు ప్లాస్టిక్ కవర్లల్లో చుట్టి ఉన్న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను టాయ్ లెట్ కు వెళ్లిన కొందరు ప్రయాణికులు, బీఎంటీసీ సిటీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు చూశారు. వెంటనే బీఎంటీసీ బస్టాండ్ లో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రదేశం మొత్తాన్నీ ఖాళీ చేయించారు. తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ ఘటనపై బెంగళూరు వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ గిరీష్.. విలేకరులతో మాట్లాడారు.
జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఆరా తీస్తోన్నామని అన్నారు. దీనికోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వీటిని ఎక్కడి నుంచి తెచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టామని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
The police were yet to register an FIR as the inspection was still underway. @DeccanHerald pic.twitter.com/5cN5L7p2Zk
— Prajwal D'Souza (@prajwaldza) July 23, 2025
బెంగళూరు రద్దీ ప్రాంతాల్లో ఒకటి.. ఈ కళాసిపాళ్య బస్టాండ్. ఈ బస్టాండ్ మీదుగా దాదాపుగా అన్ని ప్రాంతాలకు సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాదిమంది ప్రయాణికులు వచ్చీపోతుంటారిక్కడికి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులూ కొద్ది దూరంలోనే ఆగుతుంటాయి. అలాంటి చోట పేలుడు పదార్థాలు లభించడం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications