వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ పోలీసాఫీసర్ ఘర్షణ: గెటవుట్ అంటూ మంత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

ఫతేహాబాద్: అక్రమ మద్యం అమ్మకాలపై చేపట్టిన చర్యలపై సంతృప్తి చెందని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ జిల్లా మహిళా పోలీస్ ఉన్నతాధికారి, ఫతేహాద్ ఎస్పీ సంగీతా కలియాపై ఘర్షణకు దిగారు. పలు గ్రామాల్లో అక్రమంగా అనేక సంఖ్యలో మద్యం దుకాణాలను తెరిచిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకున్నామని, రికార్డుస్థాయిలో కేసులు నమోదు చేశామని మంత్రి అడిగిన ఓ ప్రశ్నకు మహిళా అధికారి సమాధానమిచ్చారు.

అయితే అధికారి సమాధానంపై సంతృప్తి చెందిన మంత్రి గెటవుట్ అని ఆదేశించారు. మంత్రి తీరును తప్పుపట్టిన మహిళా అధికారి బయటకు వెళ్లకపోగా స్వయంగా వాదనకు దిగారు. ప్రభుత్వ అధికారులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆగ్రహించిన ఆయన సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

 Get out, Haryana mantri tells top cop after spat

ఆ ఘర్షణ యావత్తు వీడియోలో రికార్డు అయింది. అయితే, సంగీతా కలియాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. సంఘటన జరగడానికి ముందు ఏడాదిగా ఆబ్కారీ చట్టం కింద 2500 కేసులు నమోదు చేసినట్లు సంగీత కలియా చెప్పారు. అయితే, మంత్రి దానితో సంతృప్తి చెందలేదు.

మద్యం మాఫియాతో పోలీసులకు సంబంధాలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని మంత్రి అన్నారు. దీంతో ఇది ప్రభుత్వ వ్యవహారమన, మద్యం అమ్మకాలపై లైసెన్స్ ఇచ్చింది ప్రభుత్వమేనని మహిళా పోలీసు అధికారి అన్నారు. దీంతో మంత్రి తీవ్రంగా ఆగ్రహిస్తూ సమావేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు.

English summary
Haryana minister Anil Vij on Friday asked superintendent of police (SP) Sangeeta Kalia to "get out" of a meeting in Fatehabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X