ఆ వీడియోపై పోలీసులు సీరియస్: ట్విట్టర్‌పై ఎఫ్ఐఆర్: జర్నలిస్టులపైనా
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దుమారానికి దారి తీసిన ఘజియాబాద్ ఉదంతంపై అక్కడి పోలీసులు యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. దీనితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న కొందరు జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలు సహా ట్విట్టర్ యాజమాన్యంపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘజియాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనకు మతం రంగు పులమడానికి ప్రయత్నించారనే కారణంతో కాంగ్రెస్ నేతలు, జర్నలిస్టులపై కేసు పెట్టారు. దానికి సంబంధించిన వీడియోను వైరల్‌గా మారడాన్ని నిరోధించడంలో విఫలమైనందున ట్విట్టర్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
ఘజియాబాద్ సమీపంలోని లోని అనే ప్రాంతంలో 72 సంవత్సరాల వయస్సున్న ఓ ముస్లిం వృద్ధుడిపై కొందరు వ్యక్తులు దాడి చేయడానికి సంబంధించిన వీడియో అది. ఆ వృద్ధుడిని అబ్దుల్ సమద్‌గా గుర్తించారు. ఆయనపై కొందరు వ్యక్తులు దాడి చేసి, తీవ్రంగా కొట్టడం, గడ్డాన్ని కత్తిరించడం వంటి దారుణ చర్యలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్, కొందరు జర్నలిస్టులు ఆరోపించారు. జైశ్రీరామ్, వందేమాతరం అంటూ నినాదాలు చేయాలంటూ ఆయనను కొట్టారనేది వారి ఆరోపణ. కొందరు జర్నలిస్టులతో కలిసి ఈ ఘటనకు మతం రంగు పులమడానికి ప్రయత్నించారని ఘజియాబాద్ పోలీసులు పేర్కొన్నారు.

ఈ కారణంతో మహ్మద్ జుబేర్, సబా నక్వీ, రాణా అయ్యూబ్, సల్మాన్ నిజామీ, సమా మహ్మద్‌తో పాటు ఓ ఇంగ్లీష్ న్యూస్ పోర్టల్‌పై కేసు నమోదు చేశారు. ఈ వీడియోను వైరల్‌గా మార్చడాన్ని నిరోధించడంలో ట్విట్టర్ విఫలమైందనే కారణంతో- ఆ సంస్థ పేరును కూడా ఇందులో చేర్చారు. ట్విట్టర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, భారత్‌లోని ట్విట్టర్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై వేర్వేరుగా కేసులు పెట్టారు. నిందితులపై 153, 153-ఎ, 295-ఎ, 505, 120-బీ, 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ పరిణామం.. ట్విట్టర్‌పై వేటు వేయడానికి మరింత ఊతమిచ్చినట్టయిందని అంటున్నారు.
Recommended Video
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications