దారుణం: తండ్రిని అడ్డుపెట్టి కూతురిపై అత్యాచారం, నగ్న ఫోటోలు, వీడియోలతో ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: తండ్రి అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకొని కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.. అయితే మద్యానికి బానిసగా మారిన తండ్రి చికిత్స పొందుతూ మరణించడంతో అదే వ్యక్తి కుటుంబానికి అండగా ఉంటామని నమ్మించి మోసం చేశాడు. దీంతో బాధిత యువతి అసలు విషయాన్ని బయటపెట్టింది. తల్లి సహయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శాడిస్ట్ మొగుడు: 'ఆ విషయం లీక్ చేసిందనే శైలజపై దాడి'

అవకాశం చిక్కితే చాలు మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడేవారు అనేక మందిని చూస్తుంటాం. అయితే కుటుంబంలో నెలకొన్న పరిస్థితులను ఆసరాగా చేసుకొన్న ఓ వ్యక్తి టీనేజీ యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివాహేతర సంబంధం: కూతురికి చిత్రహింసలు, ఆ సుఖం కోసమే ఇలా...

ఆమెను నమ్మించి అత్యాచారం చేసిన సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను బహిరంగపరుస్తామని బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే ఈ బ్లాక్‌మెయిల్‌ తట్టుకోలేక నిందితుడు చెప్పినట్టే బాధిత యువతి నడుచుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

తండ్రి అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకొని కూతురిపై రేప్

తండ్రి అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకొని కూతురిపై రేప్

దక్షిణ ఢిల్లీలో 12వ తరగతి చదవుతుంది ఓ యువతి. ఆమె తండ్రి మద్యానికి బానిసగా మారాడు. దీంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చికిత్స కోసం గత ఏడాది జూలైలో ఘజియాబాద్‌లోని హ్యాపీ హోమ్స్‌ రిహాబ్‌ సెంటర్‌లో చేర్పించి చికిత్స అందించటం మొదలుపెట్టారు.అయితే రిహబ్ సెంటర్ యజమాని కన్ను యువతిపై పడింది.

తండ్రి ఆరోగ్య విషయమై పిలిపించి రేప్

తండ్రి ఆరోగ్య విషయమై పిలిపించి రేప్

తండ్రిని రిహబ్ సెంటర్లో చేర్పించిన రెండు రోజులకే యువతికి రిహబ్ సెంటర్ నిర్వాహకుడు ఫోన్ చేశాడు.నీ తండ్రి మానసిక స్థితి బాగోలేదు. మాట్లాడాలి వెంటనే రావాలంటూ యువతిని కోరాడు. అయితే యువతి అందుకు నిరాకరించింది.ఆమె ఇంటికి సమీపంలోని మహిపాల్‌పూర్‌లోని హోటల్‌కు వెళ్లి అక్కడ మానసిక వైద్యుడ్ని కలవాలంటూ సూచించాడు. అక్కడికి వెళ్ళిన యువతికి మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇవ్వటంతో స్పృహ కోల్పోగా.. రిహబ్ సెంటర్ నిర్వాహకుడు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

నగ్నఫోటోలతో బ్లాకి మెయిల్

నగ్నఫోటోలతో బ్లాకి మెయిల్

యువతిపై అత్యాచారం చేసిన రిహబ్ నిర్వాహకుడు ఆమె నగ్న ఫోటోలను, వీడియోలను తీశాడు..ఈ విషయాన్ని బయటపెడితే తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు నగ్న ఫోటోలు, వీడియోలను బయటపెడతానని హెచ్చరించాడు.

పలుమార్లు అత్యాచారం

పలుమార్లు అత్యాచారం

యువతి నగ్న ఫోటోలు, వీడియోలను ఆధారం చేసుకొని పలు మార్లు ఆ దుర్మార్గుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత యువతి ఆరోపిస్తోంది.ఈ ఏడాది జనవరిలో చికిత్స పొందుతూ ఆమె తండ్రి చనిపోయాడు. అయితే యువతిపై తన పాచిక పారదని భావించిన నిందితుడు కొత్త డ్రామాకు తెరతీశాడని బాధిత యువతి ఆరోపిస్తోంది.

కుటుంబానికి అండగా ఉంటానని

కుటుంబానికి అండగా ఉంటానని

తండ్రి చనిపోవడంతో కుటుంబానికి అండగా ఉంటానని రిహబ్ నిర్వాహకుడు చెప్పాడని బాధితురాలు చెబుతోందిబాధిత కుటుంబానికి చెందిన రవాణా వ్యాపారాన్ని చూసుకోవటం ప్రారంభించాడు. అయితే వచ్చే ఆదాయంలో పైసా కూడా వారికి ఇవ్వకుండా సతాయించటంతో మోసపోయామన్న విషయం ఆ కుటుంబానికి ఆలస్యంగా అర్థమైంది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The teen claimed that the accused continued to rape her on the pretext of keeping her father alive. Unfortunately, her father passed away in January 2017 during the treatment.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి