దారుణం: యువతి కిడ్నాప్, కదులుతున్న కారులో గ్యాంగ్‌రేప్
దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్న దుండగులు.. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్న దుండగులు.. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నోయిడా గోల్ఫ్ కోర్స్ మెట్రో స్టేషన్ నుంచి ఓ 24ఏళ్ల యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. స్కార్పియో వాహనంలోకి బలవంతంగా ఓ వ్యక్తిగా ఆమెను లాగాడు. దీంతో కారులో ఉన్న మరో ఇద్దరు లోపలికి లాగారు. ఆ తర్వాత వారంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం అక్షరధామం మెట్రో స్టేషన్ వద్ద ఆమెను వదిలివెళ్లిపోయారు. నడిచేందుకు ఇబ్బంది పడుతున్న ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications