college girl: కాలేజ్ క్యాంపస్ లో విద్యార్థుల ముందే అమ్మాయిని 10 సార్లు పొడిచి చంపేశాడు. అక్కడే !
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థినిని కత్తితో పొవడవడంతో తీవ్రగాయాలైన ఆమె రక్తపు మడుగులో పడి మరణించింది. ఇక విద్యార్థినిని కత్తితో పొడిచిన కిరాతకుడు వేరే కాలేజీలో చదువుతున్నాడు. అమ్మాయిని కత్తితో పొడిచి దారుణంగా చంపేసిన నిందితుడు అదే కత్తితో పొడుచుకున్నాడు. యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. కాలేజ్ లో కళాశాలలో ప్రేమ విషయంలో విద్యార్థుల మధ్య గొడవ జరిగి ఒకరి హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

న్యూఇయర్ మరుసటి రోజే దారుణ హత్య
కొత్త సంవత్సరం వేడుకలు ఆదివారం రావడంతో కాలేజ్ కు సెలవు ప్రకటించారు. ఆదివారం న్యూఇయర్ వేడుకలు ముగించుకున్న విద్యార్థులు రాత్రి హ్యాపీగా నిద్రపోయి సోమవారం ఉదయం కాలేజికి చేరుకున్నారు. ఇదే సమయంలో కాలేజీకి వెళ్లిన విద్యార్థినిని చావు కొని తెచ్చుకుంది. యువతి కడుపుతో పాటు వరీరంలోని ఇతర భాగాల్లో పొడవడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో ఉండి ఒద్దాడుతున్న సమయంలో వేరే విద్యార్ధులు ఆమెను రక్షించడానికి ప్రయత్నించడంతో మిమ్మల్ని కూడా చంపేస్తా అని నిందితుడు వారిని బెదిరించాడు. తరువాత అదే కత్తితో నిందితుడు కడుపులో పొడుచుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసాడు. వరకు.

బీటెక్ అమ్మాయి
బెంగళూరు నగరం శివార్లలోని రాజనకుంటేలోని ప్రెసిడెన్సీ కాలేజ్ లో లయస్మిత అలియాస్ లయా (19) అనే యువతి బీటెక్ చదువుతోంది. కోలారుకు చెందిన లయస్మిత సోమవారం ఉదయం కాలేజ్ కు వెళ్లింది. మద్యాహ్నం 1 గంట సమయంలో క్లాస్ రూమ్ లో నుంచి లయస్మిత స్నేహితులతో కలిసి బయటకు వచ్చింది. ఆకాలేజీలోకికి వెళ్లిన పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్ సమీపంలో నిలబడి ఉన్న లయస్మితకి బయటకి లాక్కొని వెళ్లి ఆమెను 10 కంటే ఎక్కువ సార్లు కత్తితో పొడిచేయడంతో ఆమె చనిపోయింది.

వేరే కాలేజ్ అబ్బాయి
లయస్మితన పొడిచి చంపేసిన పవన్ కల్యాణ్ కూడా అదే కత్తితో అతని కడుపులో పొడుచుకోవడంతో కుప్పకూలిపోయాడు. పవన్ కళ్యాణ్ వేరే కాలేజీలో బీసీఏ చదివాడని, ప్రేమ విచారణలో లయస్మితకు పవన్ కల్యాణ్ కు గొడవ జరిగిందని, చివరికి లయస్మిత హత్యకు గురి అయ్యే వరకు వెళ్లిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కోలారు జిల్లా మళబాగిలుకు చెందిన లయస్మిత బెంగళూరు సమీపంలోని కాలేజ్ లో చదువుతోందని పోలీసులు చెప్పారు.

ఐసీయూలో పవన్
లయస్మితను కాలేజ్ అంబులెన్సు లో ఆసుపత్రికి తీసుకువెళ్లామని, అయితే అప్పటికే ఆమె చనిపోయిందని కాలేజ్ యాజమాన్యం అంటోందని పోలీసులు అన్నారు. పవన్ కల్యాణ్ అనే కిరాతకుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. బెంగళూరులోని నృపతుంగ రోడ్డులోని ఓ కాలేజ్ లో పవన్ కల్యాణ్ బీసీఏ చదువుతున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications