శారీరక సుఖం కోసం ప్రియురాలికి టార్చర్, బ్లాక్ మెయిల్, వరుడి చేతికి సీక్రెట్ ఫోటోలు, ఆత్మహత్య !
మైసూరు/బెంగళూరు: కులాలు వేరైనా యువతి, యువకుడు ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రేమికులను పెద్దలు మందలించి కులాంతర వివాహం చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని బెదిరించారు. అమ్మాయికి నచ్చచెప్పి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేశారు. అప్పటి నుంచి ప్రియుడు తనకు శారీర సుఖం ఇవ్వాలని, లేదంటే ఇద్దరు సన్నిహితంగా, ఏకాంతంగా తీసుకున్న సీక్రెట్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని, కాబోయే వరుడికి పంపిస్తానని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ప్రియురాలు విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది.

ప్రేమికులు
కర్ణాటకలోని మైసూరు సమీపంలోని నంజనగూడు తాలుకా మెల్లహళ్ళిలో మేఘనా (20), మణికంఠ అనే యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి మేఘనా, మణికంఠ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన మేఘనా, మణికంఠ చాలా కాలం సంతోషంగా ఉన్నారు.

పెద్దల వార్నింగ్
మేఘనా, మణికంఠ కులాలు వేరు. మణికంఠ కంటే మేఘనా ఎక్కువ కులానికి చెందినది. తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించామని, మీరు అంగీకరించాలని మేఘనా, మణింకఠ వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. మీరు పెళ్లి చేసుకుంటే మీ కులాలు వేర్వేరు అని మీ పిల్లలను ఎవ్వరూ పెళ్లి చేసుకోరని, మీరు మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోరాదని మేఘనా, మణికంఠకు వారి పెద్దలు మెదడు వైట్ వాష్ చేసి మనసులు మార్చడానికి ప్రయత్నించారు. .

ప్రియురాలి నిశ్చితార్థం
మణికంఠను మరిచిపోవాలని మేఘనాకు ఆమె తల్లిదండ్రులు నచ్చచెప్పారు. మేము చెప్పిన చోట నువ్వు వివాహం చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటావని, లేదంటే సమస్యలు ఎదురౌతాయని మేఘనాకు చెప్పారు. మేఘనా మనసు మార్చిన ఆమె తల్లిదండ్రులు వారి కులానికే చెందిన మరో యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిపించారు.

ప్రియుడి బ్లాక్ మెయిల్
మేఘనా నిశ్చితార్థం జరిగిపోయే వరకు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సైలెంట్ గా ఉన్న మణికంఠ తరువాత అతని అసలు స్వరూపం బయటపెట్టాడు. తనకు శారీర సుఖం ఇవ్వకపోతే ఇద్దరూ ఏకంతంగా, కలిసిమెలసి ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని ప్రియురాలు మేఘనాను బెదిరించాడు.

వరుడికి సీక్రెట్ ఫోటోలు పంపించి !
శారీరక సుఖం అందివ్వడానికి మేఘనా నిరాకరించింది. అయితే ప్రియురాలి మేఘనాను ఎంత బ్లాక్ మెయిల్ చేసినా ఆమె లొంగకపోవడంతో ఆమెకు కాబోయే భర్తకు ఇద్దరూ కలిసి ఏకాంతంగా తీసుకున్న ఫోటోలు పంపించాడు. కాబోయే భర్త మణికంఠ, మేఘనా కలిసి తీసుకున్న ఫోటోలు చూసి నాకు ఈ పెళ్లి వద్దు అని తేల్చి చెప్పాడు.

ప్రియురాలి ఆత్మహత్య
మాజీ ప్రియుడు మణికంఠ చేసిన పనికి తన పెళ్లి ఆగిపోయిందని జీవితంపై విరక్తి పెంచుకున్న మేఘనా విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మేఘనా ఆత్మహత్యకు మణికంఠ కారణం అని మేఘనా తండ్రి మహదేవయ్య దోడ్డకలవంద పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేఘనా ఆత్మహత్య చేసుకున్న తరువాత మణికంఠ పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications