లెంపకాయ వేశాడు, ప్రాణం వదిలిన పాప
జంషెడ్ పూర్: గుక్కపట్టి ఏడుస్తున్న కుమార్తె మీద లెంపకాయ వెయ్యడంతో బాలిక మరణించిన సంఘటన జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో జరిగింది. బాలిక మరణానికి కారణం అయిన తండ్రిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని డీఎస్పీ బీ.ఎన్. సింగ్ అన్నారు.
జంషెడ్ పూర్ లోని స్టీల్ సిటి శివార్లలోని నయాబస్తీ ప్రాంతంలో మురళి పాత్రో అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. ఆదివారం రాత్రి బాలిక గట్టిగా ఏడుస్తున్నది. బాలికను సముదాయించడానికి మురళి పాత్రో అనేక రకాలుగా ప్రయత్నించాడు.

అయితే బాలిక కేకలు వెయ్యడం నిలపలేదు. అంతే మురళి పాత్రోకు కోపం కట్టలు తెంచుకునింది. ఒక్కసారిగా కుమార్తెను దగ్గరకు లాక్కోని లెంపకాయ వేశాడు. దెబ్బ గట్టిగా తగలడంతో బాలిక కుప్పకూలిపోయింది. సృహ తప్పిందని మురళి పాత్రో అనుకున్నాడు.
తరువాత వెంటనే బాలికను టాటా ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే బాలిక అప్పటికే మరణించిందని వైద్యులు నిర్దారించారు. నిత్యం తన భర్త పాపను పదేపదే కొట్టడం వలనే ప్రాణాలు పోయాయని బాలిక తల్లి పోలీసుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మురళి పాత్రోను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications