ఇంట్లో బంధించి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, హత్య
లుథియానా: పంజాబ్‌లోని లుథియానాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాల విద్యార్థినిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేశారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గడిచిన బుధవారం విద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.
బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఓ ఇంట్లో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై దారుణంగా చంపేసి మృతదేహాన్ని కాలువలో పారేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బాలికపై అత్యాచారం జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు. శరీరంపై 17 గాయాలతో పాటు తల పగిలి ఉంది. పదునైన ఆయుధంతో తలపై దాడిచేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. జరిగిన దారుణ సంఘటనపై బాలిక కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఆందోళన చేపట్టారు.
తెలిసినవారే ఈ దారుణానికి ఒడి గట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇద్దరు లేదా అంతకు ఎక్కువ మంది ఈ నేరంలో పాలుపంచుకున్నట్లు భావిస్తున్నారు. బాధితురాలిని కారులో తీసుకుని వెళ్లి ఓ ఇంట్లో బందించి ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. బాధితారులి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications