తండ్రిని కొట్టిచంపి,తల్లికి సమాచారం ఇచ్చిన కూతురు, ఎందుకంటే ?
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని భారెల్లీ ప్రాంతంలో కన్నకూతురిపై అత్యాచారానికి ప్రయత్నించిన తండ్రిని కర్రతో కొట్టి చంపింది ఓ కూతురు. తండ్రి చంపి ఆమె తల్లికి సమాచారం ఇచ్చింది.
ఉత్తర్ ప్రదేశ్ :అందరికీ విఢ్యాబుద్దులు చెప్పి విధ్యార్థులకు బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు అరాచకానికి పాల్పడ్డాడు.కన్నకూతురుపై అత్యాచారానికి ప్రయత్నించాడు.అయితే ఆమె ప్రతిఘటించి కన్నతండ్రిని కొట్టిచంపింది.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ లో సోంపాట్ అనే టీచర్ తన కూతరిపై అత్యాచారానికి ప్రయత్నించాడు.అయితే తన తండ్రినే తనపై అత్యాచారానికి ప్రయత్నిస్తే ఆ కూతురు తీవ్రంగా ప్రతిఘటించింది. కన్న తండ్రిని కొట్టిచంపింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని బారెల్లీ ప్రాంతంలో సోంపాల్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. 14 ఏళ్ళ తన కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు.దీంతో ఆమె ప్రతిఘటించి అతణ్ని కొట్టి చంపింది.
తండ్రిపై దాడి చేయడంతో ఆయనలో చలనం లేకుండా పోయింది.అయితే ఈ విషయాన్ని తర్వాత ఆమె తన తల్లికి చేరవేసింది.ఈ ఘటన జరిగిన సమయంలో బాలిక తల్లి ఇంటిలో లేదు. ఈ సమయాన్ని అనువుగా చేసుకొని ఆయన బాలికపై అత్యాచారానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.












Click it and Unblock the Notifications