కూతురితో తల్లి వ్యభిచారం: భార్యకు నిప్పు, తల్లి హత్య

బాలిక ఫిర్యాదు ప్రకారం.. తన తల్లి తనను మూడు ప్రాంతాలలో తిప్పిందని, అక్కడ తనను బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు ఒత్తిడి చేసిందని చెప్పింది. అందుకు తాను అంగీకరించకపోవడంతో తనపై దాడి చేసిందని, అంతేగాక తనకు తినేందుకు ఆహారం కూడా కొన్ని రోజులుగా పెట్టలేదని బాలిక తల్లిపై ఆరోపించింది. తన తండ్రి గత ఏడాది మరణించాడని బాలిక తెలిపింది. ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో తన తల్లి తనను బలవంతంగా వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నించిందని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భార్యకు నిప్పు పెట్టి, కత్తితో పొడిచి తల్లి హత్య
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భింగ్ జిల్లాలో బుధవారం దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను, తన తల్లిని హత్య చేశాడో దుండగుడు. పోలీసుల కథనం ప్రకారం.. రంవీర్ విశ్వకర్మ(40) అనే నిందితుడు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అసహనానికి గురై క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్య సునిత(36)పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత తన తల్లి సావిత్రి(60)ని కత్తితో పొడిచి చంపాడు.
నిందితుడి దాడిలో అతని కూతురు కూడా తీవ్రంగా గాయపడిందని, అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. దాడిలో నిందితుడు కుమారుడు సుందర్ (4)కి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో నిందితుడు విశ్వకర్మను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications