ఆ 'రైలు' ఎక్కడమే ఆమె జీవితానికి శాపంలా.. కకావికలమైన జీవితం

ప్లాట్ ఫామ్‌పై నీళ్ల సీసాలు విక్రయించే ఓ వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. భార్య సహకారంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

న్యూఢిల్లీ: బంధువుల ఇంటికని బయలుదేరిన బాలిక.. పొరపాటున వేరే రైలు ఎక్కేయడంతో.. ఆమె జీవితమే కకావికలమైపోయింది. అమాయకురాలిని చేసి ఆమె జీవితంతో ఆటలాడుకుంది ఓ జంట.

వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌కి చెందిన బాలిక(15) తమ బంధువుల ఇంటికి బయలుదేరింది. అయితే పొరపాటున తను ఎక్కాల్సిన రైలు కాకుండా ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కింది. తీరా ఢిల్లీలో దిగాక కానీ తనకేమి అర్థం కాలేదు. అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అమాయక తచ్చాడుతున్న ఆ బాలిక.. ఓ వ్యక్తి కళ్లలో పడింది.

ప్లాట్ ఫామ్‌పై వాటర్ బాటిల్స్ విక్రయించే ఓ వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. భార్య సహకారంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం భార్య భర్తలు ఇద్దరు కలిసి బాలికను రూ.70వేలకు పప్పు యాదవ్ అనే వ్యక్తికి అమ్మేశారు.

girl trapped and raped in delhi railway station

బాలికను రెండు నెలల పాటు ఇంట్లో పెట్టుకుని పప్పు యాదవ్ చిత్రహింసలకు గురిచేశాడు. శారీరక వేధింపులకు గురిచేశాడు. కొద్దిరోజులకు బాలిక అక్కడినుంచి కూడా తప్పించుకుంది. అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో మళ్లీ వాటర్ బాటిల్స్ అమ్మే వ్యక్తి భార్య కంటపడింది.

దీంతో వాటర్ బాటిల్ లో మత్తు మందు కలిపి బాలిక స్పృహ కోల్పోయాక ఆమెను వేరొకరికి అప్పగించింది. రైల్వే స్టేషన్ లో నిర్మానుష్యంగా ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అతను అత్యాచారం చేశాడు. అనంతరం దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ బాలిక గురించి ఎవరో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం బాలికకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. బాలిక తెలిపిన వివరాల మేరకు పప్పు యాదవ్ తో పాటు, రైల్వే స్టేషన్ వద్ద బాలికపై అత్యాచారం జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

బాలికను ట్రాప్ చేసిన వాటర్ బాటిల్స్ అమ్ముకునే వ్యక్తి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+