Girlfriend: హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు, ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న 11 రోజులకు, వాషౌట్, ఎస్ఐ !
బెంగళూరు/ మైసూరు: ఒకే ఊరిలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఐదు సంవత్సరాల పాటు ఇద్దరూ ప్రేమించుకుని సంతోషంగా తిరుగుతున్నారు. సంవత్సరం క్రితం ఓ యువకుడు ప్రేమికుల మద్యలో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి ప్రేమికుల మద్య గొడవలు మొదలైనాయి. అతను తనకు స్నేహితుడు మాత్రమే అని, నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు ఆమె ప్రియుడికి నచ్చ చెప్పింది. నువ్వు ఎవరితో అంటే వాళ్లతో తిరుగుతూ నన్ను పెళ్లి చేసుకుంటానని చెబితే నేను ఒప్పుకోనని, నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలని ప్రియుడు రివర్స్ అయ్యాడు. ఇంతకాలం తనతో తిరిగావని, తనతో శారీరక సంబంధం పెట్టుకుని ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పడం సరికాదని ప్రియురాలు ప్రియుడికి చెప్పింది. నువ్వు చెడిపోయావు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీకు చాలా మందితో అక్రమ సంబంధం ఉంది అంటూ ప్రియురాలిని నానామాటలు మాట్లాడి ఆమె మీద ప్రియుడు దాడి చేశాడు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా తీసుకున్న ఫోటోలు నీ మొబైల్ ఫోన్ లో ఉన్నాయని, వాటిని ఇచ్చేయాలని ప్రియుడు చెప్పాడు. మొబైల్ ఫోన్ ఇవ్వడానికి ప్రియురాలు నిరాకరించడంతో నేరుగా ఆమె ఇంటికే వెళ్లి ఆమె మీద దాడి చేసిన ప్రియుడు ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్లాడు. తరువాత ప్రియురాలు ప్రియుడి మీద పోలీసు కేసు పెట్టింది. కేసు నమోదు చెయ్యడానికి ఎస్ఐ నిరాకరించాడు. నేరుగా ఇంటికి వెళ్లిన ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు దాడి చెయ్యడంతో అవమానంతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని అనుకున్న కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియులు చేసి సైలెంట్ గా ఉండిపోయారు. యువతి దినాలు చెయ్యడానికి ఇంటికి పెయింట్ చేయిస్తున్న సమయంలో ఆమె రూమ్ లో ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన డెత్ నోట్ చిక్కడం కలకలం రేపింది. ప్రియుడితో పాటు ఆమె మీద దాడి చేసిన 8 మంది మీద, కేసు పెట్టకుండా తన ఆత్మహత్యకు కారణం అయిన ఎస్ఐ పేరుతో సహ అందరిపేర్లు రాసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. అమ్మాయి అందరి పేర్లు డెత్ నోట్ లో రాసిపెట్టడంతో ఇప్పుడు కేసు అనేక మలుపులు తిరిగింది.

ఐదు సంవత్సరాల నుంచి ప్రేమికులు
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకా చెన్నపట్టణలో శోభా అనే యువతి నివాసం ఉంటున్నది. చెన్నపట్టణలో నివాసం ఉంటున్న లోకేష్ అనే యువకుడితో శోభాకు ముందునుంచి పరిచయం ఉంది. ఒకే ఊరిలో నివాసం ఉంటున్న లోకేష్, శోభా ప్రేమించుకున్నారు. ఐదు సంవత్సరాల పాటు శోభా, లోకేష్ ఇద్దరూ ప్రేమించుకుని సంతోషంగా తిరిగారు.

మరో యువకుడు ఎంట్రీ
సంవత్సరం క్రితం చెన్నపట్టణలో నివాసం ఉంటున్న సురేష్ అనే యువకుడు లోకేష్, శోభా ప్రేమికుల మద్యలో ఎంట్రీ ఇచ్చాడు. శోభాకు, సురేష్ కు పరిచయం అయ్యింది. కొంతకాలం నుంచి శోభా, సురేష్ మాట్లాడుకుంటున్నారు. తన ప్రియురాలు శోభా సురేష్ అనే యువకుడితో తిరుగుతోందని లోకేష్ కు తెలిసింది. అక్కడి నుంచి లోకేష్, శోభా ప్రేమికుల మద్య గొడవలు మొదలైనాయి.

నువ్వు తిరుబోతు అని ఎదురు తిరిగిన ప్రియుడు
శోభాను ఆమె ప్రియుడు లోకేష్ నిలదీశాడు. సురేష్ తనకు స్నేహితుడు మాత్రమే అని, నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు శోభా ఆమె ప్రియుడు లోకేష్ కు నచ్చ చెప్పింది. నువ్వు ఎవరితో అంటే వాళ్లతో తిరుగుతూ నన్ను పెళ్లి చేసుకుంటానని చెబితే నేను ఒప్పుకోనని, నువ్వు సురేష్ నే పెళ్లి చేసుకోవాలని ఆమె ప్రియుడు లోకేష్ రివర్స్ అయ్యాడు.

అక్రమ సంబంధం అట్టకట్టి దాడి చేసిన ప్రియుడు
ఇంతకాలం తనతో తిరిగావని, తనతో శారీరక సంబంధం పెట్టుకుని ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పడం సరికాదని శోభా ఆమె ప్రియుడు లోకేష్ కు చెప్పింది. నువ్వు చెడిపోయావు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీకు చాలా మందితో అక్రమ సంబంధం ఉంది అంటూ శోభాను నానామాటలు మాట్లాడి బూతులు తిట్టడమే కాకుండా లోకేష్ ఆమె మీద దాడి చేశాడు.

దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన ప్రియుడు
శోభా, లోకేష్ సంతోషంగా తిరిగిన సమయంలో ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలు శోభా మొబైల్ ఫోన్ లో ఉన్నాయి. మనం తీసుకున్న పర్సనల్ ఫోటోలు నీ మొబైల్ ఫోన్ లో ఉన్నాయని, వాటిని ఇచ్చేయాలని లోకేష్ అతని ప్రియురాలు శోభాకు చెప్పాడు. మొబైల్ ఫోన్ ఇవ్వడానికి శోభా నిరాకరించింది. నేరుగా శోభా ఇంటికే వెళ్లి ఆమె మీద దాడి చేసిన ప్రియుడు లోకేష్ ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయాడు.

ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు
వీదిలో అందరిముందు లోకేష్ దాడి చెయ్యడంతో శోభా అవమానంగా ఫీలైయ్యింది. శోభా ప్రియుడు లోకేష్ మీద పోలీసు కేసు పెట్టింది. కేసు నమోదు చెయ్యడానికి హుల్లహళ్ళి పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివరాజు నిరాకరించాడని ఆరోపణలు ఉన్నాయి. నేరుగా ఇంటికి వెళ్లిన శోభా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు లోకేష్ దాడి చెయ్యడంతో అవమానంతో తమ కూతురు శోభా ఆత్మహత్య చేసుకుందని అనుకున్న కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియులు చేసి సైలెంట్ గా ఉండిపోయారు.

11 రోజుల దినాలతో బయటపడిన డెత్ నోట్
శోభా దినాలు చెయ్యడానికి ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి పెయింట్ చేయిస్తున్న సమయంలో ఆమె రూమ్ లో ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన డెత్ నోట్ బయటపడటం కలకలం రేపింది. తన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తన మీద రేప్ చేశాడని, తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించి తన జీవితం నాశనం చేశాడని, అందరి ముందు దాడి చేశాడని శోభా డెత్ నోట్ లో రాసిపెట్టింది.
Recommended Video

ఎస్ఐ పేరుతో సహ అందరిపేర్లు రాసిపెట్టి ఆత్మహత్య
ప్రియుడు లోకేష్ తో పాటు ఆమె మీద దాడి చేసిన 8 మంది మీద పేర్లు, పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చెయ్యకుండా అక్కడా తనను అవమానించిన ఎస్ఐ శివరాజు పేరుతో సహ అందరిపేర్లు శోభా ఆమె డెత్ నోట్ లో రాసిపెట్టడం కలకలం రేపింది. ఎస్ఐ శివరాజ్ మీద ఉన్నతస్థాయి అధికారుల విచారణకు ఆదేశించారు. ప్రియుడు లోకేష్ తో పాటు శోభా మీద దాడి చేసిన అందరి మీద కేసు నమోదు చేశామని, లోకేష్ ను ఇప్పటికే అరెస్టు చేశామని పోలీసు అధికారులు అన్నారు. యువతి ఆత్మహత్య చేసుకున్న 11 రోజుల తరువాత డెత్ నోట్ బయటపడటంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications