వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబులెన్స్‌కు అడ్డొస్తే.. రూ. 2వేల జరిమానా కట్టాల్సిందే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇకపై ఢిల్లీలో అంబులెన్స్ దారికి అడ్డం వస్తే, ఏ కారణం చేతనైనా దాని ప్రయణానికి ఆటంకం కలిగిస్తే రూ. 2000 జరిమానా విధిస్తారు. ఈ విషయాన్ని ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) ముక్తేశ్ చందర్ వెల్లడించారు.

తమ అంబులెన్స్‌ని ఎవరైనా నిలువరించినట్లయితే తగిన ఆధారాలతో ఆస్పత్రులకు చెందిన వారు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాస్తవాలు విచారించి బాధ్యులను శిక్షిస్తామని తెలిపారు. గరిష్టంగా రూ. 2వేల జరిమానా విధిస్తామని తెలిపారు.

ఢిల్లీలో తొమ్మిది స్వైన్ ఫ్లూ కేసులు నమోదు

Give right of way to emergency vehicles or risk a fine of Rs. 2,000

దేశ రాజధాని నగరం ఢిల్లీలో తాజాగా తొమ్మిది స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. స్వైన్ ఫ్లూ సోకిన వారు ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వైద్య శాఖ అధికారి చరణ్ సింగ్ వెల్లడించారు. తాజాగా నమోదు అయిన కేసులతో ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య 49కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఉత్తరాఖండ్ గవర్నర్‌గా కేకే పాల్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా కృష్ణకాంత్‌ పాల్ గురువారం బాధ్యతలను స్వీకరించనున్నారు. రాజ్‌భవన్‌లో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి కేఎం జోషి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కెకె పాల్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నట్టు ఈ మేరకు ప్రకటన జారీ చేసింది.

ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఉన్న అజిజ్ ఖురేషీ మిజోరాంకు బదిలీ అయిన విషయం తెలిసిందే. కెకె పాల్ గతంలో మేఘాలయకు గవర్నర్‌గా వ్యవహరించటంతోపాటు నాగాలాండ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తించారు.

English summary
A person obstructing the path of an ambulance will have to pay a fine of Rs. 2000 now, Delhi Traffic Police has announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X