వారి ఆటలకు చెక్: యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుస సంచలనాలతో దూసుకు పెతున్నారు. జైళ్ల అధికారుల అవినీతిపై ఆయన దృష్టి సారించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న మాఫియా డాన్లకు అయినా చిన్నపాటి నేరస్తులకు అయినా ఒకే ఆహారం అందించాలని చెప్పారు.

యోగి మరో సంచలనం: మంత్రులకు షాక్, ప్రవర్తన నియమావళి

ఖైదీలను అందరినీ ఒకేలా చూడాలని అధికారులను యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. యూపీ హోం, జైళ్ల శాఖ, విజిలెన్స్ శాఖలపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు.

Give same food to dons and petty criminals in jails: UP CM

గతంలో కొందరు డాన్‌లు, కరడుగట్టిన నేరస్తులు జైళ్లలో ఫోన్లు వాడుతున్నారని, ప్రత్యేక వసతులు పొందుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపణలు వచ్చాయి.

దీంతో యోగి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. జైళ్లలో ఖైదీలందరినీ ఒకేలా చూడాలని, మొబైల్ ఫోన్ జామర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కరడుగట్టిన నేరగాళ్లపై దయ చూపవద్దని అధికారులను హెచ్చరించారు. పోలీసు శాఖలో అన్ని విభాగాల్లో అవినీతిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని, నేరగాళ్లు, సంఘ విద్రోహశక్తులతో సంబంధాలు ఉన్న అధికారులను గుర్తించాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
All convicts in the jails of Uttar Pradesh, whether petty criminals or notorious mafia dons, should get the same food and treatment, Chief Minister Yogi Adityanath has told state officials.
Please Wait while comments are loading...