Goa exit poll: టైమ్ చూసి దెబ్బ కొట్టిన ఓటర్లు, లీడర్స్ లెక్కలు రివర్స్, జీన్యూస్ సర్వే, తీర్పు !

పణజి/ గోవా/న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో ఆ ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి ఎవరు వస్తారు అనే విషయంలో పలు మీడియా సంస్థలు సర్వేలు చేశాయి. శనివారం రాత్రి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలు వెలువడ్డాయి. పలు చోట్ల బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతరులు సంబరాలు చేసుకుంటున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ప్రభుత్వంతో పాటు, కాంగ్రెస్ పార్టీకి, పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు సవాలుగా
స్వీకరించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడం, ఇదే నెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుల్లో టెన్సన్ మొదలైయ్యింది, పైకి పలు సర్వేల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటూ తాత్కాలికంగా తెలిసినా ఇవి కచ్చితమైన ఫలితాలు మాత్రం కాదు. సర్వే ఫలితాలు బయటకు వచ్చినా చివరి నిమిషయంలో సర్వేలు కూడా తారుమారు అయ్యే అవకావం ఉంది. శనివారం రాత్రి వెలువడిన పలు సర్వేల్లో ఆసక్తికర ఫలితాలు వెలుగు చూశాయి.

 సీట్లు మాత్రం 40.... నాలుగు దిక్కుల్లో 400 లెక్కలు

సీట్లు మాత్రం 40.... నాలుగు దిక్కుల్లో 400 లెక్కలు

గోవాలో మొత్తం 40 అసెంబ్లీ శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ జీఎఫ్ పీ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. అమ్ ఆద్మీ పార్టీ కొందరు స్వతంత్ర పార్టీ అభ్యర్థులతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది, ఇక మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ ఎంజీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. శివసేన ఎన్ సీపీ పొత్తు పెట్టుకుని గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే గోవాలో నాలుగు దిక్కుల్లోని ఓటర్ల నాడి తెలీక నాయకులు నాలుగు రకాలుగా లెక్కలు వేసుకుంటున్నారు.

 మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు

మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు

2017లో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ప్రజలు ఓటు వేసిన నాయకులు తరువాత పార్టీలు మారిపోవడంతో అక్కడ పరిస్థితులు తారుమారు అయ్యాయి. ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా గోవాలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. అయితే రానురాను పరిస్థితులు మారిపోవడంతో గోవా ప్రజలు కూడా ఆ విషయాన్ని తరువాత మరిచిపోయారు.

 లెక్కలు తారుమారు అయ్యాయని ?

లెక్కలు తారుమారు అయ్యాయని ?

2017 అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ చివరికి గోవాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మాత్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారు. గతంలో జరిగిన తప్పు జరగకుండా గెలిచిన ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు.

 జీ న్యూస్ సర్వే పక్రారం గోవా లెక్కలు ఇవే

జీ న్యూస్ సర్వే పక్రారం గోవా లెక్కలు ఇవే

గోవాలో మొత్తం 40 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. జీ న్యూస్ సర్వే ప్రకారం విజయం సాధించే ఎమ్మెల్యేల లెక్కలు ఇలా ఉన్నాయి.

బీజేపీ - 15 సీట్లు

కాంగ్రెస్ - 16 సీట్లు

అమ్ ఆద్మీ (ఆప్)- 2 సీట్లు

ఇతరులు, స్వతంత్ర పార్టీల అభ్యర్థులు 7 నియోజక వర్గాల్లో గెలిచే అవకాశం ఉందని జీ న్యూస్ సర్వే తెలిపింది. అయితే గోవాలో ఏపార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోతుందని వెలుగు చూసింది. గోవా ఓట్లు మాత్రం టైమ్ చూసి సరైన దెబ్బ కొట్టారని పలు సర్వేలల్లో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+