వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. ఏందిదీ.. 650 ఓట్ల మెజార్టీ.. ఏకంగా సీఎంకే.. ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

5 రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. 4 రాష్ట్రాల్లో బీజేపీ.. ఒక రాష్ట్రంలో ఆప్ గెలిచినా.. సీఎం అభ్యర్థులు ఓడిపోయారు. గతం కన్నా భిన్నంగా జరిగింది. గోవాలో కూడా ఇలానే జరిగింది. గోవాలో బీజేపీ మెజార్టీ మార్క్ చేరుకుంది. ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సీఎం, బీజేపీ యువ నేత ప్ర‌మోద్ సావంత్ గోవా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. సావంత్‌కు ద‌క్కిన విజ‌యం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సీఎంగా కొన‌సాగుతున్న ఆయ‌న తాజా ఎన్నికల్లో స్వ‌ల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఒకానొక ద‌శ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కంటే వెనుక‌బ‌డిపోయార‌ని వినిపించింది. మళ్లీ పుంజుకుని కేవ‌లం 650 ఓట్ల మెజారిటీతో ఆయ‌న విజయం సాధించారు. గోవాలోని శాంక్విలిమ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బ‌రిలోకి దిగిన సావంత్‌పై కాంగ్రెస్ పార్టీ ధర్మేష్‌ సగ్లానీని పోటీకి దింపింది. ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య పోటీ హోరాహోరీగానే సాగింది. గెలుపు ఇద్ద‌రి మ‌ధ్య దోబూచులాడింది.

Goa Chief Minister Pramod Sawant wins Sanquelim seat with 650 votes

సావంత్‌కు వ‌స్తోన్న ఆధిక్య‌త‌ను చూస్తున్న‌ బీజేపీ నేత‌లు..అప్ప‌టికే ఉత్త‌రాఖండ్‌లో ఓట‌మిపాలైన త‌మ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి లాగా జరుగుతుందా అని ఆందోళ‌న చెందారు. వారికి ఊర‌ట క‌లిగేలా స్వ‌ల్ప మెజారిటీతో సావంత్ కాంగ్రెస్ అభ్య‌ర్థిని ఓడించారు. గోవా సీఎంగా మ‌రోమారు ఆయ‌నే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

అయితే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం భారీ మెజార్టీతో విజయం సాధించారు. లక్ష ఓట్లతో బంపర్ విక్టరీ కొట్టారు. ఆయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. ఇదివరకు ఎమ్మెల్సీగా ఉంటూనే.. సీఎం పదవీ చేపట్టారు. అంతకుముందు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. సావంత్ మాత్రం.. స్వల్ప మెజార్టీతో గట్టెక్కడం విశేషం.

English summary
Goa Chief Minister Pramod Sawant has won Sanquelim Assembly seat. He defeated his nearest rival and Congress candidate Dharmesh Saglani by a margin of 650 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X