గోవా తదుపరి సీఎంపై బీజేపీలో చర్చ...చికిత్స కోసం ఢిల్లీకి మనోహర్ పారికర్
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపాక ప్రత్యేక విమానంలో మనోహర్ పారికర్‌ను ఎయిమ్స్‌కు తరలించారు. సెప్టెంబర్ 6వ తేదీనే అమెరికాలో చికిత్స పొందిన అనంతరం పారికర్ గోవా చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో తిరిగి కండోలిమ్ గ్రామంలోని ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు .ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న మనోహర్ పారికర్ కొన్ని నెలల పాటు అమెరికాలో చికిత్స పొందారు.
ప్రస్తుతం సీఎం పారికర్ ఆరోగ్యపరిస్థితి బాగాలేదని అంతా మంచే జరగాలని కోరుకుందామని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు. ఢిల్లీకి బయలు దేరి వెళ్లకముందు పారికర్‌ను చాలామంది ప్రజాప్రతినిధులు పరామర్శించారు. ఇదిలా ఉంటే తన ఆరోగ్యకారణాల దృష్ట్యా పారికర్ సీఎం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని బీజేపీ తెలిపింది. ఇందుకోసం బీజేపీ గోవా రాష్ట్రానికి దూతలను పంపింది. చాలా పోర్ట్ ఫోలియోలు పారికర్ వద్దే ఉన్నందున పాలనాపరమైన విధానాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని అధిష్టానం భావించింది. దీంతో పారికర్ మిత్రపక్షాల నేతలను కలిశారు.

ఇదిలా ఉంటే పారికర్ రాజీనామా చేస్తే గోవా ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర వాడి గోమంతక్ పార్టీ అధినేత సుదిన్ ధావ్‌లికర్ సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఆయన ఎంపికపై గోవా ఫార్వర్డ్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని పారికర్‌కు తెలిపింది. మరోవైపు పారికర్ సీఎంగానే కొనసాగుతారని అయితే అతని వద్ద ఉన్న పోర్ట్ ఫోలియోలను ఇతర మంత్రులకు కేటాయిస్తారని దీనివల్ల పాలన కు ఎలాంటి ఇబ్బంది కలగబోదని లోబో తెలిపారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications