Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిబ్రవరి 14న ఆ రాష్ట్రంలో హాలిడే: ప్రభుత్వం ప్రకటన

లక్నో: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎల్లుండి తొలి విడత పోలింగ్ ఆరంభమౌతుంది. ఉత్తర ప్రదేశ్‌లో మాత్రమే తొలి విడత పోలింగ్ ఉంటుంది. 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. అదే నెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

14వ తేదీన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. ఉత్తర ప్రదేశ్‌లో రెండో విడత పోలింగ్ ఉంటుంది. గోవా, ఉత్తరాఖండ్‌లల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ ముగుస్తుంది. గోవా, ఉత్తరాఖండ్‌లతో పాటు పంజాబ్‌లో కూడా అదే రోజు పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ చేసినప్పటికీ.. ఆ తరువాత దాన్ని మార్చింది. ఫిబ్రవరి 14వ తేదీన గురు రవిదాస్ జయంతి కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

గోవా అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాల సంఖ్య 40. వాటన్నింటికీ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆ రోజున మొత్తం 11,56,762 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ సజావుగా సాగడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోవా వ్యాప్తంగా 1,722 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండటానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంది ఈసీ.

Goa declares 14th February as a Public Holiday, reason is here

పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14వ తేదీన సెలవు రోజుగా ప్రకటించింది గోవా ప్రభుత్వం. అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నింటికీ సెలవు ఇచ్చింది. వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది. పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు, షాపులను మూసివేయాలని సూచించింది. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించకూడదని పేర్కొంది. ఈ మేరకు గోవా సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి శ్రీపాద్ అర్లేకర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Recommended Video

    Goa Elections 2022: BJP, Congress వ్యూహాలు TMC, AAP గట్టిపోటీ | Oneindia Telugu

    2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 19 స్థానాలను గెలుచుకోగలిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. అయిదేళ్ల పరిపాలనే గీటురాయిగా ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పుంజుకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సారి త్రిముఖ పోటీ ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+