• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Goa elections: 34మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా; ఉత్పల్ పారికర్ కు దక్కని స్థానం

|
Google Oneindia TeluguNews

గోవా అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా బిజెపి గోవా ను మళ్లీ హస్తగతం చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. గోవా అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు గురువారం ప్రకటించింది. గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. ఉత్పల్ పనాజీ నుండి టిక్కెట్ ఆశించారు . అయితే పనాజీ నుండి ఉత్పల్ పారికర్ పోటీకి బిజెపి మొండిచేయి చూపింది.

ఉత్పల్ పారికర్ కు మొండి చెయ్యి.. అభ్యర్థుల జాబితాలో దక్కని చోటు

ఉత్పల్ పారికర్ కు మొండి చెయ్యి.. అభ్యర్థుల జాబితాలో దక్కని చోటు

రెండు సంవత్సరాల గ్యాప్ మినహా, 1994 నుండి మార్చి 2019లో అకాల మరణం వరకు మనోహర్ పారికర్ పనాజీ సీటులో కొనసాగారు. దీనిపై మాట్లాడిన బీజేపీ ఉత్పల్‌కు పోటీ చేయడానికి మరో రెండు ఎంపికలను ఇచ్చామని, వాటిలో ఒకటి అతను ఇంతకు ముందు తిరస్కరించాడు. ఆయన రెండో ఆప్షన్‌ను అంగీకరించాలని మేమంతా భావిస్తున్నాం అని బీజేపీ గోవా ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో అన్నారు. మనోహర్ పారికర్ కుటుంబాన్ని బీజేపీ ఎప్పుడూ గౌరవిస్తుందని ఆయన అన్నారు. కానీ ఉత్పల్ కు మొండి చెయ్యి ఇచ్చి పార్టీ కోసం పని చేసిన నాయకులను బీజేపీ మోసం చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

సాంక్విలిమ్ నుంచి ప్రమోద్ సావంత్, మర్మ గోవా నుండి మనోహర్ అగోంకార్

సాంక్విలిమ్ నుంచి ప్రమోద్ సావంత్, మర్మ గోవా నుండి మనోహర్ అగోంకార్

సాంక్విలిమ్ నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మూడోసారి తిరిగి అక్కడ నుండి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మర్మగోవా నుంచి డిప్యూటీ సీఎం మనోహర్ అగోంకార్ పోటీ చెయ్యనున్నారు.. ఇదే సమయంలో పార్టీ నాయకత్వం మోన్సెరేట్‌కు ప్రాధాన్యత ఇస్తోందని తెలుస్తుంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేర చరిత్ర కలిగిన మాజీ మంత్రి మోన్సెరేట్‌ . జులై 2019లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడాన్ని రూపొందించిన కీలక నాయకులలో మాజీ కాంగ్రెస్‌కు చెందిన మోన్సెరేట్ ఒకరు. మొత్తం 40 సీట్లలో పోటీ చేస్తున్న బిజెపి బుధవారం వరకు నిర్వహించిన సుదీర్ఘమైన చర్చల తర్వాత జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బిజెపి నాయకుల జీవిత భాగస్వాములకు కూడా టిక్కెట్ ఇవ్వబడింది.

 ఒకే కుటుంబ సభ్యులకు టిక్కెట్లు .,. ఎవరెవరికంటే

ఒకే కుటుంబ సభ్యులకు టిక్కెట్లు .,. ఎవరెవరికంటే

ముఖ్యంగా రాణే వంశానికి కంచుకోట అయిన వాల్పోయి నుండి పోటీ చేయనున్న మోన్సెరేట్ కు, ఆయన భార్య జెన్నిఫర్ మోన్సెరేట్ కు తలైగావో నుండి టికెట్ ఇచ్చారు. ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే విషయంలో రాణే భార్య, దివ్య రాణేకు పోరియం నుండి టిక్కెట్ ఇవ్వబడింది. ఇది ప్రస్తుతం ఆమె మామ, బలమైన కాంగ్రెస్ సభ్యుడు ప్రతాప్‌సింగ్ రాణే చేతిలో ఉంది.ఒకే కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇవ్వాలనే పార్టీ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఫడ్నవీస్ బాబూష్ మోన్సెరేట్ మరియు అతని భార్య ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి వచ్చారు. వారిరువురూ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంతేకాకుండా, జెన్నిఫర్ మోన్సెరేట్‌కు తన స్వంత గుర్తింపు ఉంది. ప్రస్తుత బిజెపి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరికీ టికెట్లు ఇచ్చామని వెల్లడించారు. దివ్య రాణేకు పోరియం నుండి పోటీ చేయమని టిక్కెట్ ఇవ్వడం స్ట్రాటజీలో భాగమని దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. పోరీయం సీటుపై కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరాటం కొనసాగుతుందని, అక్కడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలబెడుతుందని, బీజేపీ మాత్రం ఓడిస్తుందని ఆయన అన్నారు.

తొమ్మిది మంది క్యాథలిక్ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ .. ఆ వాదనకు చెక్ పెట్టేలా

తొమ్మిది మంది క్యాథలిక్ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ .. ఆ వాదనకు చెక్ పెట్టేలా

ఇదిలా ఉంటే బిజెపి క్రిస్టియన్ మైనారిటీలను పక్కన పెడుతుంది అన్న నివేదికలను తిప్పికొట్టే ప్రయత్నంలో, ఆ పార్టీ తొమ్మిది మంది క్యాథలిక్ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఇప్పటివరకు గరిష్ట సంఖ్యలో మరియు 11 ఇతర వెనుకబడిన కులాల (OBC) అభ్యర్థులను రంగంలోకి దించింది. మనోహర్ పారికర్ నేతృత్వంలోని పార్టీ 2012లో ఆరుగురు, 2017లో ఎనిమిది మంది క్రైస్తవ అభ్యర్థులను నిలబెట్టింది. ముగ్గురు షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) అభ్యర్థులు, ఒక షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) అభ్యర్థి 'జనరల్' స్థానాల్లో పోటీ చేస్తారని జాబితాను ప్రకటించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. అన్నిటినీ మించి అభ్యర్థి గెలుపును ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని బీజేపీ వ్యూహాన్ని రచించి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఫిరాయింపు దారులు ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఎన్నికల పోరులో ఉన్న ఇతర పార్టీలు బీజేపీతో పోరాడాలనే వన్‌పాయింట్ ఎజెండాను కలిగి ఉండగా, బీజేపీ మాత్రం గోవా అభివృద్ధి కోసం పోరాడుతోందని దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.

English summary
The ruling BJP was announced their first list of candidates in goa elections. The BJP has announced its first list of 34 candidates for the Goa elections. Utpal Parrikar is not in the list..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X