Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Goa game: మరుపురాని సన్నివేశాలు, రిసార్టు నుంచి బయటకు ఎలా వెలుతారో నేనూ చూస్తా, డీకేశీ చాలెంజ్ !

గోవా/బెంగళూరు: గోవాలో ప్రభుత్వం మారిపోవాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. గతంలో మా పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ప్రజలు నాయకులు చేసిన చిన్న తప్పుతో ఆవేదన చెందారు. ఇప్పుడు మా పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది, గోవాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, అందులో ఎలాంటి అనుమానం లేదని కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో బీజేపీ నాయకులు చూపించిన మరుపురాని సన్నివేశాలు మరోసారి చూడకూడదని కాంగ్రెస్ బావిస్తోంది. గోవాలో కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసిన నాయకులు అందరూ రిసార్టులో ఉన్నారు. రిసార్టులో ఉన్న మా పార్టీ నాయకులు ఒక్కరు కూడా చెయ్యిజారిపోకుండా చేసే బాద్యత తన మీద ఉందని, ఆ బాద్యతను హైకమాండ్ తనకు అప్పగించిందని, గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాతే తాను ఇక్కడి నుంచి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ అంటున్నారు.

Recommended Video

    BJP takes Lead in Goa, Chief Minister Pramod Sawant Confident

     ఆ ఒక్క దెబ్బతో కాంగ్రెస్ మైండ్ బ్లాక్

    ఆ ఒక్క దెబ్బతో కాంగ్రెస్ మైండ్ బ్లాక్

    గోవాలో 40 మంది శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2017లో గోవాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. 2017లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రూపు రాజకీయల కారణంగా గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేకపోయారు.

     మరుపురాని సన్నివేశాలు.... చేదు అనుభవాలు

    మరుపురాని సన్నివేశాలు.... చేదు అనుభవాలు


    2017లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం అభ్యర్థి విషయంలో ఆలోచిస్తూ ఎవరి ముఖ్యమంత్రిని చేస్తే మనకు కలిసి వస్తోంది అని ఆలోచిస్తున్న సమయంలో బీజేపీ నాయకులు ఆడిన మైండ్ గేమ్ లో ఏకంగా అధికారం కోల్పోయింది. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులను చావు దెబ్బ కొట్టిన బీజేపీ అప్పట్లో గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాంటి మరపురాని సన్నివేశం మరోసారి చూడకూడదని ఇప్పుడు కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది.

     ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

    ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

    గోవాలో ప్రభుత్వం మారిపోవాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. గతంలో మా పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ప్రజలు నాయకులు చేసిన చిన్న తప్పుతో ఆవేదన చెందారు. ఇప్పుడు మా పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది, గోవాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, అందులో ఎలాంటి అనుమానం లేదని కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

     మంగమ్మ శపథం కాదు.... డీకేశీ శపథం

    మంగమ్మ శపథం కాదు.... డీకేశీ శపథం


    గోవాలో కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసిన నాయకులు అందరూ రిసార్టులో ఉన్నారు. రిసార్టులో ఉన్న మా పార్టీ నాయకులు ఒక్కరు కూడా చెయ్యిజారిపోకుండా చేసే బాద్యత తన మీద ఉందని, ఆ బాద్యతను హైకమాండ్ తనకు అప్పగించిందని, గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాతే తాను ఇక్కడి నుంచి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ అంటున్నారు.

     అప్పట్లో మోదీ, అమిత్ షాకు షాక్ ఇచ్చిన డీకేశీ

    అప్పట్లో మోదీ, అమిత్ షాకు షాక్ ఇచ్చిన డీకేశీ

    గతంలో గుజరాత్ ఎన్నికలకు సంబంధించి డీకే శివకుమార్ ఆడిన గేమ్ లో అప్పట్లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కంగుతిన్నారు. అలాంటి మాస్టర్ మైండ్ ఉన్న డీకే శివకుమార్ ఇప్పుడు గోవా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. గోవా రాజకీయాల్లో డీకే శివకుమార్ ఎలా చక్రం తిప్పుతారో అనే విషయం కొన్ని గంటల్లో తేలిపోనుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+