CM Wife: మోదీ హవా, పారికర్ పనితీరు, ప్రజలు ఆశీర్వాదం, నాభర్త పర్వాలేదు, సీఎం భార్య కామెంట్స్ !
గోవా/పణజి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ నాయకులు ఆనందానికి హద్దలు లేకుండా పోయాయి. గోవాలో వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. గోవాలో అధికారంలోకి రావాలని రిసార్టు రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగుతిన్నారు. గోవాలో ఓటర్లు ప్రలోభాలకు లొంలేదని మరోసారి రుజువు అయ్యిందని, బీజేపీకి ఓటు వేసి గెలిపించిన గోవాలోని 40 నియోజక వర్గాల ప్రజలు అందరికి ధన్యవాదాలు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సతీమణి సులక్షణా సావంత్ అన్నారు. నిజంగా ఈరోజు గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బతికుంటే ఆయన ముఖంలో చెదరని చిరునవ్వు చూసేవాళ్లమని, ఆయన ఎక్కడ ఉన్నా కచ్చితంగా మమ్మల్ని చిరునవ్వుతో ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ సతీమణి సులక్షణా సావంత్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హవా, గతంలో మనోహర్ పారికర్ వేసిన పునాదులు, గోవా బీజేపీ ఇన్ చార్జ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ పట్టుదల, నా భర్త, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కష్టపడిన తీరుకు ఫలితంగా ఈ రోజు మళ్లీ గోవాలో బీజేపీ అధికారంలోకి వస్తోందని సులక్షణా సావంత్ అన్నారు. అయితే గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన పణజి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

దుమ్ములేపుతున్న కమలనాథులు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ నాయకులు ఆనందానికి హద్దలు లేకుండా పోయాయి. గోవాలో వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. గోవాలో అధికారంలోకి రావాలని రిసార్టు రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగుతిన్నారు.

సీఎం భార్య హ్యాపీ
గోవాలో ఓటర్లు ప్రలోభాలకు లొంలేదని మరోసారి రుజువు అయ్యిందని, బీజేపీకి ఓటు వేసి గెలిపించిన గోవాలోని 40 నియోజక వర్గాల ప్రజలు అందరికి ధన్యవాదాలు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సతీమణి సులక్షణా సావంత్ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెలువడుతున్న సమయంలోనే గోవాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సతీమణి సులక్షణా సావంత్ మీడియాతో మాట్లాడారు.

మనోహర్ పారికర్ ను పొగిడిన సిట్టింగ్ సీఎం భార్య
నిజంగా ఈరోజు గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బతికుంటే ఆయన ముఖంలో చెదరని చిరునవ్వు చూసేవాళ్లమని, ఆయన ఎక్కడ ఉన్నా కచ్చితంగా మమ్మల్ని చిరునవ్వుతో ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ సతీమణి సులక్షణా సావంత్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ హవా
ప్రధాని నరేంద్ర మోదీ హవా, గతంలో మనోహర్ పారికర్ వేసిన పునాదులు, గోవా బీజేపీ ఇన్ చార్జ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ పట్టుదల, నా భర్త, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కష్టపడిన తీరుకు ఫలితంగా ఈ రోజు మళ్లీ గోవాలో బీజేపీ అధికారంలోకి వస్తోందని సులక్షణా సావంత్ అన్నారు.

నో కామంట్
అయితే గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన పణజి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ విషయంలో మాట్లాడటానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ సతీమణి సులక్షణా సావంత్ నిరాకరించారు.












Click it and Unblock the Notifications