"కాళీమాత"కు ఘోర అవమానం.. కలలో చెప్పిందంటూ !!

ముంబైలోని చెంబూర్‌లో ఉన్న కాళీమాత ఆలయంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కాళీమాత రూపంలో ఉండే విగ్రహం మేరీ మాత అలంకరణలో దర్శనమివ్వడంతో భక్తులు షాక్‌కు గురయ్యారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా.. హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మేరీమాత అలంకరణలో కాళీమాత విగ్రహం..

కాగా హిందూ దేవత విగ్రహం క్రైస్తవ మతంలోని మేరీ మాత మాదిరిగా అలంకరించారు. సాధారణంగా భయరూపిణీగా కనిపించే కాళీమాతను ఈ తరహాగా అలంకరించడం చూసి అంతా షాక్ అవుతున్నారు. కొన్ని క్షణాల్లోనే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విగ్రహాన్ని చూసి ఆశ్చర్యానికి గురైన భక్తులు వెంటనే దీంతో ఇదేంటని ఆలయ పూజారి రమేష్‌ను ప్రశ్నించారు. కానీ పూజారి ఇచ్చిన వివరణ భక్తులను మరింతగా ఆగ్రహపరిచినట్టు తెలుస్తోంది.

goddess-kali-maatha-dressed-as-christian-merry-maa-at-mumbai-and-video-got-viral

కలలో అమ్మవారు చెప్పారంటూ..

తన కలలో అమ్మవారు దర్శనమిచ్చి, మేరీ మాత రూపంలో అలంకరించమని చెప్పారని పూజారి సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం పట్ల స్థానిక భక్తులు, మత పెద్దలు, సాంఘిక కార్యకర్తలకు అసలు నమ్మశక్యం కాకపోవడంతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. స్థానిక భక్తుల్లో పలువురు ఈ ఘటన వెనుక పూజారి ఒక్కడి కాకుండా మరెవరైనా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూజారిని ఎవరో ప్రభావితం చేసి.. డబ్బులు ఇచ్చి ఈ పని చేయించివుండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మతాల మధ్య విభేదాలు రేపేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కావచ్చని ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై భక్తులు RCF పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేయడంతో పూజారి రమేష్‌ను అరెస్ట్ చేశారు. మత భావాలను కించపరచినందుకు IPC సెక్షన్ 295A కింద కేసు నమోదు చేశారు.
తరువాత కోర్టులో హాజరుచేయగా పూజారికి రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించబడింది. ఈ మేరకు CCTV ఫుటేజీలు, పూజారి ఫోన్ కాల్ డేటా, ఆలయంలోకి వచ్చిన వ్యక్తుల వివరాలు అన్నీ పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ గా మారడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

తప్పిదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విగ్రహానికి పునఃప్రతిష్ట చేసి ఆలయ నిర్వహణను పూర్తిగా మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. స్థానికంగా ఉద్రిక్తత పెరగడంతో పోలీసు బందోబస్తు పెంచారు. ఈ ఘటనపై హిందూ మత పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+