Gold Smuggling: స్వప్నా మేడమ్ కు షరతులతో బెయిల్, పాస్ పోర్టు ఇచ్చేయాలి, సాక్షులను ఏమైనా !

తిరువనంతపురం: కేరళతో పాటు భారతదేశాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్నా సురేష్ అలియాస్ స్వప్నాకు కేరళ హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. స్వప్నా సురేష్ తో పాటు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడు మందికి హైకోర్టులు షరుతులతో జామీను మంజూరు చేసింది. షరతులు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇదే సమయంలో హైకోర్టు నిందితులకు సూచించింది. విదేశాల నుంచి వందల కేజీల బంగారు బిస్కెట్లు అక్రమంగా రవాణా చేశారని ఆరోపిస్తూ స్వప్నా సురేష్ తో పాటు అనేక మంది అరెస్టు అయ్యారు. కొన్ని నెలల పాటు జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న స్వప్నా సురేష్ కు ఇప్పుడు హైకోర్టులో షరతులతో బెయిల్ మంజూరు కావడంతో ఆమె కుుటంబ సభ్యులు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు.

కేరళ ప్రభుత్వాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు

కేరళ ప్రభుత్వాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు

స్వప్నా సురేష్ అలియాస్ స్వప్నా ఎన్ఐఏ నుంచి అక్రమంగా బంగారు బిస్కెట్లు రవాణా చేసిందని ఆరోపణలు ఉన్నాయి. దుబాయ్ లోని విదేశాంగ శాఖ కార్యాలయంలో సుప్నా సురేష్ కు ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకున్న ఆమె అనుచరులతో కలిసి గుట్టుచప్పుడు కాకుండా కేరళకు విమానంలో బంగారు బిస్కెట్లు రవాణా చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

జైల్లో స్వప్నా సురేష్ అండ్ కో

జైల్లో స్వప్నా సురేష్ అండ్ కో

పక్కా సమాచారం అందడంతో తిరువనంతపురంలోని ఎయిన్ పోర్టులో అక్రమంగా రవాణా అయిన బంగారు బిస్కెట్లను అధికారులు సీజ్ చేశారు. ఇదే సమయంలో స్వప్నా సురేష్ తోపాటు సరిత్ ప్రభు సురేష్, ఫైజల్ ఫరీద్, సందీప్ నాయర్ తదితరులను అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

 ఐఏఎస్ అధికారి దెబ్బతో సీఎంకు షాక్

ఐఏఎస్ అధికారి దెబ్బతో సీఎంకు షాక్

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్నా సురేష్ కు పూర్తి సహకారం ఇచ్చి ఆమెను కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో ఉద్యోగం ఇచ్చారని ఆరోపిస్తూ అప్పటికే కేరళ ముఖ్యమంత్రి పనిరయి విజయన్ ప్రధాన కార్యదర్శి శివశంకర్ (ఐఏఎస్) ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. సీఎం ప్రధాన కార్యదర్శి అరెస్టు కావడంతో ప్రతిపక్షాల విమర్శలతో పినరయి విజయన్ నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి పినరయి విజయన్ కు అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు.

 షరతులతో బెయిల్

షరతులతో బెయిల్

గత ఏడాది అరెస్టు అయిన స్వప్నా సురేష్ బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేసింది. ప్రత్యేక కోర్టుల్లో స్వప్నా సురేష్ కు బెయిల్ మంజూరు కాలేదు. చివరికి స్వప్నా సురేష్ తదితరులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. స్వప్నా సురేష్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాలని, సాక్షాలు నాశనం చెయ్యడానికి ప్రయత్నించకూడదని, విదేశాలకు పారిపోకుండా పాస్ పోర్టు పోర్టును అధికారులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 ఊపిరిపీల్చుకున్న ఫ్యామిలీ

ఊపిరిపీల్చుకున్న ఫ్యామిలీ

స్వప్నా సురేష్ తోపాటు ఇదే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో 7 మందికి కోర్టు షరుతలతో బెయిల్ మంజూరు చేసింది. మొత్తం మీద కొన్ని నెలలుగా జైల్లో ఉంటున్న స్వప్నా సురేష్ కు బెయిల్ మంజూరు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం వెలుగు చూసిన తరువాత మాయం అయిపోయి తప్పించుకుని తిరుగుతున్న స్వప్నా సురేష్ ను బెంగళూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+