బంపర్ ఆఫర్.. రూ.1991కే విమానం టికెట్

గోవా కేంద్రంగా ఫ్లై91' అనే కొత్త దేశీయ విమాన‌యాన సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మొదటి సర్వీసుగా హైదరాబాద్ నుంచి గోవాకు విమానాన్ని ప్రారంభించింది. అన్ని ఛార్జీలు కలుపుకొని టికెట్ ధరను రూ.1991గా నిర్ణయించారు. ఈనెల 20న దీన్ని ప్రారంభించగా, ఒకరోజు ముందే 19న గోవా నుంచి బెంగళూరుకు కూడా విమాన సర్వీసును ప్రారంభించింది. బెంగ‌ళూరు నుంచి సింధుదుర్గ్‌కు కూడా విమాన స‌ర్వీసును ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తెచ్చారు.

హైదరాబాద్ నుంచి గోవాకు, సింధుదుర్గ్ కు రెండు సర్వీసులు నడుపుతున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మనోజ్ చాకో తెలిపారు. ప్రస్తుతం సోమవారం, శుక్రవారం, శనివారాల్లో గోవా నుంచి బెంగళూరుకు కూడా సర్వీసులు నడుస్తున్నాయి. ఏప్రిల్ నాటికి జల్గావ్, పుణె, అగట్టి లాంటి నగరాలకు కూడా సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు చాకో వెల్లడించారు. ప్రతి ఒక్కరికి అత్యంత తక్కువ ధరలకే విమానయాన సేవ‌లు అందుబాటులో ఉండాల‌నే ఉద్దేశంతోనే వీటిని నడుపుతున్నట్లు చెప్పారు. గతంలో ఎవరూ ఇవ్వని తక్కువ ధరలకే ప్రయాణికులను గ్యమస్థానాలను చేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

good news fly 91 flight tickets cost is very cheap

ఫ్లై 91 సంస్తకు డీజీసీఏ ఎయిర్ ఆపరేటర్స్ సర్టిఫికెట్ ను మంజూరు చేసింది. కేరళకు చెందిన మనోజ్‌ చాకో.. ఫెయిర్‌ఫ్యాక్స్‌ ఇండియా మాజీ హెడ్‌ హర్ష రాఘవన్‌తో కలిసి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. చాకో గతంలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమిరేట్స్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ విమాన సంస్థల్లోనూ ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఈ సంస్థకు రెండు ఏటీఆర్-72 విమానాలున్నాయి. సెప్టెంబరుకల్లా మరో నాలుగు విమానాలను సమకూర్చుకోబోతున్నారు. సంవత్సరానికి ఆరు విమానాల చొప్పున రాబోయే ఐదు సంవత్సరాల్లో 30 విమానాలను కొనుగోలు చేయనున్నారు. గోవా, బెంగళూరు, హైదరాబాద్‌, అగట్టి, సింధ్‌ దుర్గ్‌, జలగావ్‌ మధ్య ఉడాన్‌ స్కీమ్‌ కింద కేంద్రం మార్గాలను కేటాయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+