LIC: ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు మోడీ సర్కారు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్‌కు సంబంధించి పలు ప్రయోజనాలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోని పది లక్షల మందికిపైగా ఎల్ఐసీ ఏజెంట్లు, లక్షకుపైగా ఉన్న ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు సోమవారం ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎల్ఐసీ ఏజెంట్లకు ప్రస్తుతం అందిస్తున్న గ్రాట్యూటీ మొత్తాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. వారికి ప్రయోజనాలు అందించే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అంతేగాక, రీ అపాయింట్ అయిన ఏజెంట్లకూ రెన్యూవల్ కమీషన్ పొందేందుకు అర్హత కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం పాత ఏజెన్సీలో బిజినెస్ పూర్తి చేసినవారికి రెన్యువల్ కమీసన్ అందడం లేదు.

ఇక ఎల్ఐసీ ఏజెంట్లకు టర్మ్ ఇన్స్యూరెన్స్ కవరేజీని ప్రస్తుతం ఉన్న రూ. 3000-10 వేల స్థాయి నుంచి రూ. 25,000-1.5 లక్షల స్థాయికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దీంతో మృతి చెందిన ఏజెంట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. మరోవైపు, ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమం అందించేందుకు అందరికీ ఒకే తరహా 30 శాతం ఫ్యామిలీ పెన్షన్ కింద అందివ్వనున్నట్లు వెల్లడించింది.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఏజెంట్లు, లక్షకుపైగా ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఎల్ఐసీ ఈ స్థాయికి చేరడానికి ఏజెంట్లు, ఉద్యోగుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ వ్యాఖ్యానించింది. 1956లో రూ. 5 కోట్ల మూలధనంతో ఏర్పాటైన ఎల్ఐసీ.. 2023, మార్చి నాటికి ప్రపంచంలోని పెద్ద సంస్థల్లో ఒకటిగా ఎదగడం గమనార్హం. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications