రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్తగా పది వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు...
రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు ఓ శుభవార్తను మోసుకొచ్చింది. దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య పెరగనుంది. భారతీయ రైల్వే దేశంలో కొత్తగా పది వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ - పూణే మార్గంలో కొత్తగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును త్వరలో ప్రారంభం కానుంది. సికింద్రాబాద్-పూణే మార్గం అత్యంత రద్దీగా ఉండే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ మార్గంలో వందేభారత్ ట్రైన్ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
వందేభారత్ ట్రెయిన్స్ ప్రయాణీకులకు వేగవంతమైన ప్రయాణంతో పాటు అన్నీ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ట్రైన్స్ ప్రయాణికులలో మంచి ఆదరణను కూడా సొంతం చేసుకున్నాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-పూణే వందేభారత్ రైలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వందేభారత్ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడంతో వీటి సంఖ్యను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే అన్ని వర్గాల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అందుకోసం వందేభారత్ రైళ్ల సంఖ్యను పెంచే పనిలో ఉన్నారు.

మరో పది వందేభారత్ రైళ్లు : వందేభారత్ రైళ్లు ఇప్పటి వరకు మొత్తం 33 రైళ్లను ప్రవేశపెట్టారు. ఇవి దేశవ్యాప్తంగా వివిధ నగరాలు,రాష్ట్రాల మధ్య నడుస్తున్నాయి. వందే భారత్ రైళ్లలో ఇప్పటి వరకు ఏ ఇతర రైళ్లలోనూ లేని కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సౌకర్యాలతో వీటి ఆక్యుపెన్సీ రేషియో కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ రైళ్లకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు అందుబాటులో ఉండే సేవలను మరింత విస్తరించే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, సికింద్రాబాద్-పూణే వందేభారత్ రైలుతోపాటు, వారణాసి-లక్నో, పాట్నా-జల్పాయిగురి, మడ్గావ్-మంగళూరు, ఢిల్లీ-అమృతసర్, ఇండోర్-సూరత్, ముంబయి-కొల్హాపూర్, ముంబయి-జల్నా, పూణే-వడోదర, టాటానగర్-వారణాసి సెక్షన్ల మధ్య కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వేశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications