వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీళ్లడిగిన ముండే, ఆందోళనతోనే మృతి: ఇదీ ప్రస్థానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే మంగళవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన భద్రతా సిబ్బందిని మంచినీళ్లు అడిగి తాగారు. ముండే మృతి విషయాన్ని వైద్యులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... గోపినాథ్ ముండే మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు మృతి చెందారని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో ముండేకు తీవ్ర గాయాలు కాలేదన్నారు.

ప్రమాదం జరగగానే ఆందోళనకు గురై మృతి చెంది ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ముండే కారును మరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదం జరగగానే ముండే మంచినీళ్లు అడిగి తాగారని చెప్పారు. అనంతరం తనను ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని భద్రతా సిబ్బందికి సూచించారన్నారు. ప్రమాదం సమయంలో కారులో ముండే వెనుక సీట్లు కూర్చున్నారని చెప్పారు.

గోపినాథ్ ముండే మహారాష్ట్రలోని పరాలీలో 1949 డిసెంబర్ 12న జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1980 నుండి 1985, 1990 నుండి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1992 నుండి 1995 వరకు మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేతగా పని చేశారు. 1995 నుండి 1999 వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీడ్ లోకసభ స్థానం రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు.

ముండే మృతి మహారాష్ట్రలో బిజెపికి ఎదురు దెబ్బ. నవంబర్ నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయన ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. బిజెపి, శివసేనలు మహారాష్ట్రలో కూటమిగా ఉన్నాయి. బిజెపి నుండి ముండే, శివసేన నుండి ఉద్ధవ్ థాకరేలు సిఎం రేసులో పోటీ పడుతున్నారు.

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముండే అసలు పేరు గోపీనాథ్ పాండురంగ్ ముండే.

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

1949 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని పరాలీలో వంజరి కులానికి చెందిన వ్యవసాయదారుల కుటుంబంలో ముండే జన్మించారు. ఐదుసార్లు మహారాష్ట్ర అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు.

 గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

1992-1995 కాలంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా ముండే వ్యవహరించారు. 1995-1999 మధ్య కాలంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2014 లో లోకసభకు ఎన్నికయ్యారు.

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

లోకసభలో బీజేపీ డిప్యూటీ లీడర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం మోడీ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలను ఆయన నిర్వర్తిస్తున్నారు.

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

బిజెపి అగ్రనేతల్లో ఒకరైన దివంగత ప్రమోద్ మహాజన్ సోదరి అయిన ప్రద్న్యని ముండే వివాహమాడారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు (పంకజ, ప్రీతం, యషశ్రీ) ఉన్నారు. వీరిలో పంకజ ఎమ్మెల్యే కాగా, ప్రీతం డాక్టరు. యషశ్రీ లా చదువుతున్నారు.

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

తన స్నేహితుడు, కాలేజ్‌లో సహ విద్యార్థి అయిన ప్రమోద్ మహాజన్ ప్రోద్బలంతోనే గోపీనాథ్ ముండే రాజకీయాల్లోకి వచ్చారు. తనదైన ముద్ర వేశారు.

 గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే మహారాష్ట్ర బిజెపిలో కీలక నేత. ప్రమోద్ మహాజన్ తర్వాత మహాలో ఆయనే ముఖ్యనేత. ఆయన బిజెపి నుండి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

మహారాష్ట్రలో శివసేన, బిజెపిలు కూటమిగా ఉన్నాయి. శివసేన కూటమి నుండి ఉద్దవ్ థాకారేతో సిఎం రేసులో గోపీనాథ్ ముండే పోటీ పడుతున్నారు.

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

ఈ నవంబర్ నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో మహారాష్ట్రలో పార్టీకి పెద్ద దిక్కు అయిన గోపీనాథ్ మృతి ఆ పార్టీకి ఎదురు దెబ్బే.

English summary
After a serious road accident on his way to the Indira Gandhi International Airport to Mumbai for a victory rally, the new rural development minister Gopinath Munde incurred injuries and was brought dead to the AIIMS hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X