వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: రూ.5లక్షలలోపు ఆదాయానికి పెన్షనర్లకు నో ట్యాక్స్‌?

ఆదాయ పన్ను మినహాయంపులో పెన్షనర్లకు భారీ ఉపశమనం లభించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తోంది.ఈ మేరకు 2018 కేంద్రబడ్జెట్‌లో ఈ అంశాన్ని చేర్చేందుకు కసరత్తు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను మినహాయంపులో పెన్షనర్లకు భారీ ఉపశమనం లభించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తోంది.ఈ మేరకు 2018 కేంద్రబడ్జెట్‌లో ఈ అంశాన్ని చేర్చేందుకు కసరత్తు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది బడ్జెట్‌ కోసం కసరత్తు నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఏ వర్గాలపై పన్నుల భారం వేయాలి, ఏ వర్గాలపై కరుణ చూపాలనే విషయాలపై ఇప్పటి నుండే కసరత్తులు మొదలయ్యాయి.

బడ్జెట్‌లో అన్ని వర్గాలను సంతృప్తి పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించిందని సమాచారం. ఈ మేరకు ఇప్పటి నుండి సమాచారాన్ని సేకరిస్తోందంటున్నారు.

రూ.5 లక్షల పెన్షనర్లకు పన్ను మినహయింపు

రూ.5 లక్షల పెన్షనర్లకు పన్ను మినహయింపు

రూ.5లక్షల వరకు పెన్షనర్లకు ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చే అంశాన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఈ మేరకు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం 60 నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్న సీనియర్ పౌరుడు అయిన పింఛనుదారుడుకి లభిస్తున్న ఆదాయం పన్ను మినహాయింపు రూ 3లక్షలు. అయితే వచ్చే ఏడాది బడ్జెట్‌లో దీన్ని రూ. 5 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

శశిథరూర్‌ లేఖకు జైట్లీ సమాధానం

శశిథరూర్‌ లేఖకు జైట్లీ సమాధానం

కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఇటీవల చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నుండి లేఖ వచ్చింది.పెన‍్షనర్లకు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలనే ప్రతిపాదనను 2018 వచ్చే బడ్జెట్ నాటికి పరిశీలిస్తామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు. 2018 లో ఆర్ధిక బిల్లులో దీని ఫలితాన్ని ప్రతిబింబించే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.

ట్వీట్ చేసిన శశిథరూర్

ట్వీట్ చేసిన శశిథరూర్


రూ.5 లక్షల వార్షిక ఆదాయం వచ్చే పెన్షనర్లను ఆదాయ పన్నునుంచి మినహాయించాలనే తన అభ్యర్ధనకు ప్రభుత‍్వంనుంచి కొంత-ప్రోత్సాహక ప్రత్యుత్తరం వచ్చిందంటూ థరూర్ ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నెక్ట్స్‌ బడ్జెట్‌ లో ఈ అంశాన్ని చేరుస్తారనే ఆశాభావాన్ని వ్యక‍్తం చేశారు.

రూ.5 లక్షల వార్షికాదాయం దాటకపోతే

రూ.5 లక్షల వార్షికాదాయం దాటకపోతే

పెన్షన్‌తో సహా మొత్తం ఆదాయం రూ.5 లక్షలు మించకపోతే, 80 ఏళ్లకు పైబడిన పింఛనుదారుడు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. శశి థరూర్‌ నవంబర్ 14 న కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని ప్రస్తుత నిబంధనలకు సవరణ చేయాలని కూడా ఆయన ప్రతిపాదించారు.

English summary
The finance ministry has informed Congress MP Shashi Tharoor that his suggestion to increase the tax exemption limit for pension up to Rs 5 lakh would be examined during the ongoing preparations for the Union Budget 2018, according to a communication.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X