మాతృభూమిపై అడుగు పెట్టే వీలూ లేదిక: స్వదేశానికి వచ్చే భారతీయులపై నిషేధం..తక్షణమే అమలు.. !
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం.. మరింత తీవ్రమైంది. భారతీయ పాస్‌పోర్టులపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. భారతీయ పాస్‌పోర్టు ఉన్న వారెవరూ స్వదేశానికి అడుగు పెట్టలేరు ఇక. ఈ నిషేధం బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం అప్పటి పరిణామాలను బట్టి.. దాన్ని పొడిగించడమో లేదా ఆ నిషేధాన్ని ఎత్తేయడమో చేస్తామని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అధికారులు వెల్లడించారు.

విదేశాల నుంచి వచ్చిన వారిలోనే అధికం..
మనదేశంలో ఇప్పటిదాకా 132 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో ఎక్కువ శాతం కేసులు.. పొరుగు దేశాలు లేదా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించిన దేశాల నుంచి వచ్చిన వారిలోనే కనిపించాయి. ఇటలీ, సౌదీ అరేబియా, దుబాయ్, ఇరాన్, యూకే వంటి దేశాల నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయులే పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయా లక్షణాలు కనిపించిన వారిలో మెజారిటీ శాతం పాజిటివ్‌గా తేలాయి.

యూరోపియన్ యూనియన్ సహా..
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు తాజా ఆదేశాలను జారీ చేసింది. యూరోపియన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ పరిధిలో ఉంటూ భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్యాన్ని కొనసాగించే దేశాల్లో నివసించే భారతీయులు తమ సొంత గడ్డపై కాలు మోపే అవకాశాన్ని కోల్పోయినట్టే.. తాత్కాలికంగా. ఈ యూరోపియన్ యూనియన్ పరిధిలో మొత్తం 27 దేశాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్, నార్వే, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాల్లో నివసించే భారత పాస్‌పోర్టుదారులు మనదేశానికి రాకపోకలు సాగించడంపైనా నిషేధాన్ని వర్తింపజేశారు.
Recommended Video

గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి..
దీనితోపాటు గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారికి 14 రోజుల పాటు క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, ఒమన్, కువైట్ నుంచి వచ్చే భారతీయులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని ఆదేశించింది. వారి రాకపోకలపై ఎలాంటి నిషేధం లేనప్పటికీ.. క్వారంటైన్‌ను మాత్రం తప్పనిసరి చేసింది. ఇప్పటికే చైనా, కొరియా, ఇరాన్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ ఇదివరకే కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గల్ఫ్ దేశాలను కూడా ఈ జాబితాలోకి చేర్చింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications