ఐటీ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, అందరికి సెలవు, మీ జీతం మాత్రం కట్ కాదు, ఎందుకంటే!
ఐటీ హబ్ బెంగళూరులో ప్రతిసారి పౌర సంస్థలు, ఎన్నికల అధికారులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఈసారి అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ఐటీ బీటీ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారులు, బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ సూచించారు.
బెంగళూరులో ఐటీ-బీటీ శాఖ సహకారంతో జిల్లా ఎన్నికల అధికారి తుషార్ గిరినాథ్ ఐటీ-బీటీ సంస్థల అధినేతలతో సమావేశం నిర్వహించారు. ఐటీ-బీటీ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి లోక్ సభ ఎన్నికల పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని, అందరికీ ఓటింగ్ తప్పనిసరి చేయాలని ఐటీ-బీటీ సంస్థల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఐటీ బీటీ కంపెనీల యాజమాన్యంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

సమావేశం పూర్తి అయిన తరువాత లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీన వేతనంతో కూడిన సెలవుల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల గురించిన సమాచారాన్ని పంచుకున్నారు. అన్ని ఐటీ-బీటీ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఐటీ బీటీ సంస్థలలోని అధికారులకు అందరికీ సమాచారం అందించారు. ఐటీ బీటీ సంస్థ అధిపతులందరూ పోలింగ్ రోజు ఉద్యోగులకు సెలవు ఇచ్చేందుకు అంగీకరించారు.
ఓటింగ్‌పై అవగాహన కల్పించాలని కూడా ఐటీ బీటీ సంస్థల యజమాన్యంకు చెప్పినట్లు ఎన్నికల అధికారులు మీడియాకు చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించేందుకు బెంగళూరులోని ఐటీ-బీటీ సంస్థలు ఎక్కువగా ఉన్న చోట ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఐటీ బీటీ సంస్థలు హెచ్ఆర్ఎంఎస్ వ్యవస్థను కలిగి ఉన్నాయని, దీని ద్వారా సిబ్బందికి తప్పకుండా ఓటు వేయాలని మెసేజ్ లు పంపించాలని సూచించామని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన ఐటీ-బీటీ సంస్థల్లో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు ఇక్కడ ఓటు హక్కు లేదు. మరికొందరు ఇంటి నుంచే పని చేయడంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేకపోతున్నారు. దానికి తోడు పోలింగ్ బూత్ లలో సరైన వ్యవస్థ లేదన్న వైఖరి ఉంది. ఈ పోలింగ్ బూత్‌లలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలియజేసారు. అన్ని సంస్థల సిబ్బంది ఓటు వేయాలని, అందుకే సెలవుతో కూడిన వేతనం ఇవ్వాలని ఆ సంస్థలకు సూచించామని ఐటీ బీటీ విభాగం కార్యదర్శి శ్రీమతి ఏక్ రూప్ కౌర్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications