వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలయాల్లో మహిళా అర్చకులు, జయ శిక్షపై: సీఎం సిద్దు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వ ఆలయాల్లో ఇక నుంచి పూజల నిర్వహణకు మహిళా అర్చకులను కూడా నియమించాలని యోచిస్తున్నారు. కడ్రోలీ శ్రీగోకర్ణనాథేశ్యర ఆలయంలో మంగుళూరు దసరా ఉత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల్లో మహిళా అర్చకులను నియమించాలన్న ప్రతిపాదనలకు భక్తులంతా సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగుళూరు దసరా ఉత్సవాలు కూడా మైసూరు దసరా ఉత్సవాల్లా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని అన్నారు.

కర్ణాటక ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు: సీఎం సిద్దరామయ్య

Government would consider appointing women as priests in Karnataka temples: Siddaramaiah

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు పరప్పన అగ్రహార ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్షకు కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్ఫష్టం చేశారు. బెంగుళూరులోని విధానసౌధ వద్ద యువత సైకిల్ జాబితాను ఆదివారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు.

జయలలిత శిక్షకు కారణం కర్ణాటకే అంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. "కోర్టులు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. ఇందులో ఇతరుల జోక్యం ఉండదు. లేని పోని వదంతుల్ని ప్రచారం చేసి శాంతిభద్రతల్ని దెబ్బతీయడం సరికాదు " అని అన్నారు.

English summary
Karnataka Government would consider appointing women priests to conduct pujas in state-run temples, Chief Minister Siddaramaiah has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X