షాకింగ్: చిన్నమ్మను చంపేశారు -ఓటరు జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు -ఈసీతో సర్కారు కుట్రన్న టీవీవీ
ప్రజాస్వామిక పండుగగా భావించే ఎన్నికల ప్రక్రియలో అక్రమ వ్యవహారాలకూ కొదువుండదు. చాలా సార్లు రాజకీయ పార్టీలు గీత దాటి వ్యవహరిస్తే.. కొన్ని సార్లు ఈసీనే అతి చేస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం తప్పిదాల వల్ల ఎన్నికలు జరిగిన ప్రతిసారి వేల కొద్దీ ఓట్లు గల్లంతైపోతుంటాయి. తాజాగా
తల్లిని
చూసి
ఆయనకు
సీఎం
పదవి
-పిరికితనం
పనికిరాదన్న
జస్టిస్
ఎన్వీ
రమణ
-శ్రీశైలంలో
ప్రత్యేక
పూజలు

శశికళ పేరు తొలగింపు..
పోలింగ్ వేళ తమ ఓట్లు గల్లంతయ్యాయంటూ సాధారణ పౌరులు ఆందోళనకు దిగడం, కొన్ని సార్లు సెలబ్రిటీలు సైతం ఓట్లేయడానికి నానా తంటాలు పడుతుండటం నిత్యం మనం చూసేదే. అయితే ఓటునే శ్వాసగా బతికే బడా రాజకీయ నేతల ఓట్లు కూడా గల్లంతు కావడం ఒకింత కాకరేపుతున్నది. దివంగత జయలలితకు నెచ్చెలిగా, తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పి, అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురై, ఆ తర్వాత రాజకీయాలకూ స్వస్తిచెప్పిన వీకే శశికళకు భారీ షాక్ తగిలింది. ఈసీ అధికారులు ఓటరు జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు.
రాఫెల్
కుంభకోణం:
షాకింగ్
ట్విస్ట్
-భారతీయ
మధ్యవర్తికి
భారీగా
లంచం
-దసాల్ట్
రికార్డుల్లో
పట్టివేత

థౌజండ్ లైట్స్ స్థానంలో..
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం(ఏప్రిల్ 6న) ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతున్నది. శశికళ తన ఓటు హక్కును కోల్పోయిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. జయలలిత నివాసమైన పోయేస్ గార్డెన్ చిరునామాలోనే శశికళ దశాబ్దాలపాటు ఉన్నారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పోయెస్ గార్డెన్ ఇప్పుడు జయ స్మారక స్థలిగా మారిపోయింది. ఆ భవంతికి దగ్గర్లోనే మరో ఇంట్లో శశికళ నివాసం ఉంటున్నారు. కాగా, శశికళతోపాటు పోయెస్ గార్డెన్ లో నివసించిన 19 మంది పేర్లనూ ఈసీ ఓటరు జాబితా నుంచి తొలగించింది. వారిలో ఇలవరసి కూడా ఉన్నారు.

చిన్నమ్మను చంపేశారు.. పోస్టల్‌కైనా?
నాలుగేళ్లు జైలులో ఉండటంతో సదరు చిరునామాపై ఎవరూ లేరన్న సాకుతో శశికళ పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అన్యాయమని, కనీసం పోస్టల్ బ్యాలెట్ ద్వారానైనా ఓటేసే అవకాశం కల్పించాలని ఎఎంఎంకె అభ్యర్ధి వైద్యనాథన్ కోరుతున్నారు. శశికళ జైలు నుండి విడుదలైన వెంటనే ఓటు హక్కు కోసం ఈసీని సంప్రదించారని, అయితే అటు నుంచి ఏ స్పందనా రాలేదని శశికళ న్యాయవాది రాజా సెంతురు పాండియన్ చెప్పారు. ''ఒక పౌరురాలిగా శశికళను ఈ ప్రభుత్వమే చంపేసింది. ఈసీతో కలిసి పళని సర్కార్ కుట్ర చేసింది''అని టీవీవీ దినకరన్ మండిపడ్డారు. ఓటరు జాబితా సవరణ గతంలోనే పూర్తయినందున కొత్తగా శశికళకు ఓటేసే అవకాశాన్ని కల్పించలేమని ఈసీ స్పష్టం చేసింది.