వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాహనదారులకు శుభవార్త: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ గడువు పెంపు -పొల్యూషన్‌ సర్టిఫికెట్‌‌పైనా కేంద్రం కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని వాహనదారులకు ఊరట కలిగించే వార్తను కేంద్ర ప్రభుత్వం వెలువరించింది. అన్ని రకాల వాహనాలకు సంబంధించిన పత్రాల చెల్లింపు గడువును మరో మూడు నెలలు పొడిగించింది. అదే సమయంలో పొల్యూషన్ సర్టిఫికేట్ల జారీపైనా అనూహ్య నిర్ణయం తీసుకుంది.

Miyazaki Mango:ప్రపంచంలో ఖరీదైన మామిడి -కేజీ 2.7లక్షలు -ఎంపీలో 7పండ్లకు 6 కుక్కలు, 4గార్డుల కాపలా Miyazaki Mango:ప్రపంచంలో ఖరీదైన మామిడి -కేజీ 2.7లక్షలు -ఎంపీలో 7పండ్లకు 6 కుక్కలు, 4గార్డుల కాపలా

డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ) వంటి వాహన సంబంధిత డాక్యుమెంట్ల వ్యాలిడిటీని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Govt extends validity of vehicle documents incl driving licence till Sep30, Uniform Pollution Check

నిజానికి గత ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును కేంద్ర ప్రభుత్వం గతంలో 2021 జూన్ 30 వరకు పొడిగించింది. మళ్లీ ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించింది. వాహనానికి చెందిన ఫిట్‌నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లు అన్నీ సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ క్లిష్ట సమయంలో పౌరులు, రవాణాదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది. మరోవైపు,

covid పుట్టుకపై షాకింగ్ ట్విస్ట్: chinaలో కాదు, అమెరికాలోనే -whoతో దర్యాప్తునకు డ్రాగన్ డిమాండ్covid పుట్టుకపై షాకింగ్ ట్విస్ట్: chinaలో కాదు, అమెరికాలోనే -whoతో దర్యాప్తునకు డ్రాగన్ డిమాండ్

పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ (పీయూసీ- పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌) జారీ విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఏకరీతిన పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే, పీయూసీ డేటాను జాతీయ రిజిస్టర్‌తో అనుసంధానం చేస్తూ నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇకపై అందజేసే పొల్యూషన్‌ సర్టిఫికెట్‌పై వాహనం నంబర్‌, యజమాని పేరు, అతడి ఫోన్‌ నంబర్‌, ఇంజిన్‌ నంబర్‌, చాసిస్‌ నంబర్‌, ఉద్గార స్థితి తదితర వివరాలతో పాటు క్యూఆర్‌ కోడ్‌ కూడా ముద్రించనున్నారు. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌కు మొబైల్‌ నంబర్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు పేర్కొంది. ఇకపై నిర్దేశించిన ప్రమాణాల కంటే ఎక్కువ ఉద్గారాలు విడుదలవుతున్నట్లేతే రిజక్షన్‌ స్లిప్‌ను కూడా అందించనున్నారు.

English summary
The government has extended the validity of motor vehicle documents including the driving licence and registration certificate till September 30 in light of the ongoing COVID-19 pandemic. The Ministry also issued a notification to make the PUC (Pollution Under Control) certificate for all vehicles uniform across the country and also to link the PUC database with the National Register.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X