ఎయిరిండియా ప్రైవేటు పరం... జూన్‌లోగా 51 శాతం వేలం: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా

న్యూఢిల్లీ: పీకల్లోతు నష్టాలలో కూరుకుపోయిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను వదిలించుకునేందుకు కేంద్రం వేగంగా అడుగులేస్తోంది. ఎయిరిండియాను ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధమవుతోంది.

ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ, నష్టాల్లో నడుస్తున్న ఎయిరిండియాకు తిరిగి మహర్దశ తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ మేరకు ఎయిరిండియాను ప్రైవేటుపరం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలిపారు.

Govt plans to wrap up Air India sale by Dec: Jayant Sinha

ఎయిరిండియాలో 51 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుని, జూన్ నాటికి బిడ్డింగ్ నిర్వహించి, డిసెంబర్ నాటికల్లా చట్టబద్ధమైన ముగింపు పలకాలని నిర్ణయించామని మంత్రి జయంత్ సిన్హా తెలిపారు.

ఎయిర్ ఇండియాను నష్టాల బారినుంచి గట్టెక్కించేందుకు 2012లో తీసుకొచ్చిన టర్న్ అరౌండ్ విధానానికి ఇప్పటి వరకు 30,231 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, అయినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని జయంత్ సిన్హా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+