బడ్జెట్: పది కోట్ల మందికి రూ. 5 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్
Recommended Video

న్యూఢిల్లీ: ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రధాన్యత ఇచ్చింది. ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వైద్య, ఆరోగ్యంపై కేంద్రీకరించనున్నట్టు ప్రకటించారు. కొత్తగా పది కోట్ల మందికి ఐదు లక్షల మేరకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ఏటా మెడికల్ ఇన్సూరెన్స్ ను అందించనున్నట్టు జైట్లీ ప్రకటించారు.

దేశంలో కొత్తగా ఈ ఏడాది 54 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్టు జైట్లీ ప్రకటించారు. రూ.330 చెల్లిస్తే ఏటా 5 లక్షల భీమాను కుటుంబానికి వర్తింప చేయనున్నట్టు జైట్లీ ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది కొత్తగా 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్క మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నట్టు జైట్లీ చెప్పారు.
కొత్తగా దేశంలో సుమారు 54 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.క్షయ రోగులకు ప్రతి నెల రూ.500లను అందించనున్నట్టు జైట్లీ ప్రకటించారు.
ఈ మేరకు 600 కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 24 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల స్థాయిని పెంచనున్నట్టు జైట్లీ స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమంగా ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి అభివర్ణించారు. ఆయుష్మాన్‌భవ సహా పలు ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలను పరిపుష్టం చేస్తామని చెప్పారు












Click it and Unblock the Notifications