వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మోడీని ఓఎల్ఎక్స్‌లో అమ్మేస్తామంటున్నారు’!

|
Google Oneindia TeluguNews

ముంబై: అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై తనదైన శైలిలో విమర్శలు చేసే శివసేన మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ లాంటి చోటా నేతలకు కూడా విమర్శలు చేసే అవకాశం కల్పించారని మండిపడ్డారు.

'ఎన్నికలకు ముందు మోడీ చాలా హామీలే గుప్పించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తానని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టస్తానని, అచ్చెదిన్ (మంచిరోజులు) తీసుకొస్తానని ఇలా చాలా విషయాలే చెప్పారు. తీరా ప్రధానమంత్రి అయ్యాక తన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. అందువల్లే కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా మోడీని ఓఎల్ఎక్స్‌లో అమ్మేస్తామని హెచ్చరిస్తున్నారు' అని బిజెపి మిత్రపక్షమైన శివసేన విమర్శించింది.

Govt’s failure allows Kanhaiya to talk of selling Modi on Olx: Sena

ఈ మేరకు శివసేన అధికార పత్రిక 'సామ్నా' ప్రధాని మోడీ లక్ష్యంగాగా ఓ సంపాదకీయాన్ని వెలువరించింది. మోడీ వైఫల్యం వల్లే జెఎన్ యూ విద్యార్థి నేత అయిన కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా ఆయనను విమర్శిస్తున్నారని మండిపడింది.

పాత వస్తువులు అమ్మే ఓఎల్ఎక్స్ లో ప్రధానిని అమ్మేస్తామని కన్హయ్య లాంటి నేతలు కూడా విమర్శలు చేస్తున్నారని పేర్కొంది. ఇది బిజెపికి ఆమోద యోగ్యం కాకూడదని తెలిపింది. కన్నయ్య లాంటి నేతలకు బిజెపి ఊపిరి అందిస్తున్నదని, ఇప్పటికైనా ఆ పార్టీ ఆత్మ విమర్శ చేసుకుని ముందుకు సాగాలని సూచించింది.

English summary
The unfulfilled election promises of Prime Minister Narendra Modi have emboldened even a ‘tinpot’ like JNU students’ union president Kanhaiya Kumar to criticise him, the Shiv Sena said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X