ఆధార్‌తో పనిలేకుండానే ప్రభుత్వ పథకాలు: కేంద్రం కీలక ప్రకటన!

భారత సర్కారు దేశ ప్రజలకు, ముఖ్యంగా పేదలు, వయోవృద్ధులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2026 అక్టోబర్ 14న ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు తప్పనిసరిగా అందజేయాలి. ఆధార్ కార్డ్ లేకపోయినా లేదా బయోమెట్రిక్ సరిపోలకపోయినా కూడా పథకాల లబ్ధిని నిరాకరించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈవీ + పెట్రోల్ క్రేజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1100 కిలోమీటర్లు.. క్యూ కడుతున్న కస్టమర్లు!
ఈవీ + పెట్రోల్ క్రేజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1100 కిలోమీటర్లు.. క్యూ కడుతున్న కస్టమర్లు!

అనేక మంది వయోవృద్ధులు, పేద కుటుంబాల నుంచి ప్రభుత్వానికి నిరంతరం ఫిర్యాదులు అందుతుండేవి. వయసు పైబడటం వల్ల వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం, సాంకేతిక లోపాల వల్ల బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయకపోవడం వంటి కారణాలతో వారి రేషన్, పింఛను, ఇతర ప్రభుత్వ సాయం నిలిచిపోయేది. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన సమస్యలను గమనించిన కేంద్ర ప్రభుత్వం, అర్హులైన ఏ ఒక్కరూ లబ్ధి పొందకుండా ఉండిపోకూడదననే ఉద్దేశంతో ఈ కీలక మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

Govt Scheme Benefits Without Aadhaar Centre Issues New Guidelines alternative documents and rules

బయోమెట్రిక్ విఫలమైతే ప్రత్యామ్నాయ మార్గాలు
ప్రభుత్వ పథకాల అమలులో బయోమెట్రిక్ అథెంటికేషన్ వైఫల్యమే అతిపెద్ద సమస్యగా మారింది. కొత్త నిబంధనల ప్రకారం ఒకవేళ బయెమెట్రిక్ మ్యాచ్ కాకపోతే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లబ్ధిదారుని గుర్తింపును ధ్రువీకరించాల్సి ఉంటుంది. అధికారులు వెంటనే ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు పరిశీలించి లబ్ధిని అందించాలి. కేవలం మెషీన్ లేదా సాంకేతిక లోపం కారణంగా ఏ ఒక్కరినీ ప్రభుత్వ సహాయానికి దూరం చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

డీలిమిటేషన్ బిల్లు పై కేంద్రం అనూహ్య నిర్ణయం, కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్..!!
డీలిమిటేషన్ బిల్లు పై కేంద్రం అనూహ్య నిర్ణయం, కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్..!!

ఆధార్ లేకపోతే ఈ పత్రాలు ఉంటే చాలు
అసలు ఆధార్ కార్డే లేని వారి కోసం కూడా ఈ నోటిఫికేషన్లో ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఆధార్ నమోదు సమయం వరకు ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను ప్రామాణీకంగా స్వీకరిస్తారు. ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలను చూపించి పథకాల లబ్ధి పొందవచ్చు. స్థానిక అధికారులు ఈ పత్రాలను తనిఖీ చేసి అర్హులకు పథకాలను వర్తింపజేయాలి.

అర్హులకు పూర్తి రక్షణ
కేవలం కాగితాల అడ్డంకులు లేదా సాంకేతిక సమస్యల వల్ల ఏ ఒక్క అర్హులైన లబ్ధిదారుడూ పథకానికి దూరం కాకూడదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. దీనిపై సర్వత్రా అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఒకవేళ ఏ అధికారియైనా కారణం లేకుండా లబ్ధిదారునికి సాయాన్ని నిరాకరిస్తే వారిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల కుటుంబాలు ఇబ్బంది పడకుండా, గుర్తింపు ప్రక్రియ జరుగుతూనే పథకాల లబ్ధి ఏ మాత్రం ఆగిపోకుండా చూడటమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+