Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ఆస్తులు వేలం, సొంత ఊరిలో కిరాతకుడికి ఎంత ఆస్తి ఉందంటే ?

భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబానికి చెందిన నాలుగు వ్యవసాయ భూములను శుక్రవారం వేలం వేయనున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ముంబకే గ్రామంలో దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఆస్తులు ఉన్నాయి. అయితే దావుద్ ఇబ్రహీం ఆస్తులు కొనుగోలు చెయ్యడానికి వేలం పాటలో పాల్గొనే వారి సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ వేలం మాత్రం జరుగుతుందని అధికారులు అంటున్నారు.

గతంలో దావూద్ మూడు ఆస్తులను విజయవంతంగా వేలం వేసిన న్యాయవాది, శివసేన మాజీ నాయకుడు అజయ్ శ్రీవాస్తవ వేలం పాటకు హాజరు కావడం ఖాయం అయ్యింది. దావూద్ జన్మించిన ముంబకే గ్రామంలో అతని చిన్ననాటి ఇల్లుతో పాటు అతని కుటుంబానికి చెందిన భూములు కూడా ఉన్నాయని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. 2001లో వేలం వేసిన దుకాణాలు న్యాయపరమైన చిక్కుల కారణంగా నిలిచిపోయాయి.

Govt to auction assets of mafia don Dawood Ibrahim in Mumbai, Dawood Ibrahim hiding in Pakistan

1993 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఇంటికి సంబంధించిన స్వాధీన పత్రాలను త్వరలోనే తీసుకోవాలని న్యాయవాది శ్రీవాస్తవ భావిస్తున్నారు. దావుద్ ఇబ్రహీం చిన్నతనంలో పెరిగిన ఇంటిని స్వాధీనం చేసుకుని అక్కడ సనాతన పాఠశాల ప్రారంభించే యోచనలో ఉన్నట్లు న్యాయవాది శ్రీవాత్సవ తెలిపారు. నేను 2020లో దావుద్ ఇబ్రహీంకు చెందిన బంగ్లా కోసం వేలం పాటలో పాల్గొన్నానని, తరువాత ఆ బంగ్లాలో సనాతన ధర్మ పాఠశాల ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామని న్యాయవాది శ్రీవత్సవ తెలిపారు.

త్వరలో పాఠశాల నిర్మాణం ప్రారంభిస్తామని న్యాయవాది శ్రీవాత్సవ అన్నారు. నేను శుక్రవారం వేలంలో పాల్గొంటానని, అందరి భయాన్ని తొలగించేందుకు 2001లో వేలంలో పాల్గొన్నానని, ప్రజల భయంతో దావూద్ ఇబ్రహీం పని అయిపోయిందని లాయర్ శ్రీవాత్సవ అన్నారు. స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్, 1976 కింద స్వాధీనం చేసుకున్న నాలుగు ప్లాట్ల భూముల వేలం ప్రక్రియ శుక్రవారం ముంబాయిలో జరగనుంది, అయితే దావుద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తుల వేలం సర్కారువారి పాట కేవలం రూ 19.22 లక్షల మాత్రమే ఉండటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దావుద్ ఇబ్రహీం రెస్టారెంట్ వేలం :

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను 2015 వేలంలో బిడ్డర్‌లలో ఒకరు శుక్రవారం జరగనున్న వేలం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇది హాస్యాస్పదంగా ఉందని, దావూద్‌ ఇబ్రహీంకు రూ 19 లక్షలు ఒక లెక్కకాదని, అతనికి చెందిన ఇలాంటి ఆస్తులను వేలం పేరుతో ప్రభుత్వం డబ్బును వృధా చేస్తోందని ఆరోపించారు. అయితే ప్రభుత్వానికి ఇవన్నీ అవసరమా?, దావుద్ ఇబ్రహీంకు చెందిన అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని, మాజీ జర్నలిస్ట్ ఎస్ బాలకృష్ణన్ అన్నారు.

Govt to auction assets of mafia don Dawood Ibrahim in Mumbai, Dawood Ibrahim hiding in Pakistan

2015లో మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం యాజమాన్యంలోని రెస్టారెంట్ కోసం బాలకృష్ణన్ ₹ 4.28 కోట్ల వేలం పాడారు. అయితే సకాలంలో డబ్బులు ప్రభుత్వానికి జమ చేయకపోవడంతో ఆయన ఆ ఆస్తిని కోల్పోయాడు. ముంబాయి కేంద్ర బింధువు అయిన ప్రాంతమైన పక్మోడియా స్ట్రీట్‌లో దావుద్ ఇబ్రహీంకు చెందిన ఈ రెస్టారెంట్ ఉంది. దావూద్ ఇబ్రహీం అరాచకాలు అంతం చేయడానికి, తన ప్రాణాలను పణంగా పెట్టి నేను రెస్టారెంట్‌ని వేలంలో తీసుకున్నానని, కానీ ప్రభుత్వం డబ్బులు జమ చేసేందుకు తనకు సమయం పెంచలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

రూ. 4 కోట్లకు దావుద్ ఇబ్రహీం బంగ్లాను వేలంలో తీసుకున్న తరువాత ఆ డబ్బు చెల్లించే విషయంలో తనకు ప్రజల నుండి చాలా మద్దతు వచ్చిందని, నేను కొంత డబ్బు డిపాజిట్ చేశానని, అందరూ నాకు సహాయం చేస్తారని ఎదురు చేశానని, కానీ వరుస క్రిస్మస్ సెలవులు రావడం, ఆస్తిని కొనుగోలు చేసిన ఆస్తికి పూర్తి డబ్బు చెల్లించడానికి తనకు మూడు వారాలు మాత్రమే గడువు ఉండటంతో దానిని స్వాధీనం చేసుకోలేకపోయానని, తనకు కొంచెం సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించానని మాజీ జర్నలిస్ట్ ఎస్ బాలకృష్ణన్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+