వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ తో సహ 17 మందికి బందోబస్తు !

కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య తరువాత కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. గౌరీ లంకేష్ హత్యలాగా మరో హత్య జరగకుండా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, బహుబాష నటుడు, సాహితీవేత్త గిరీష్ కర్నాడ్ .

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య తరువాత కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. గౌరీ లంకేష్ హత్యలాగా మరో హత్య జరగకుండా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, బహుబాష నటుడు, సాహితీవేత్త గిరీష్ కర్నాడ్ తో పాటు ప్రముఖులకు భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, నెల నుంచి హంతకుల నిఘా, హోం మంత్రితో భేటీకి !కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, నెల నుంచి హంతకుల నిఘా, హోం మంత్రితో భేటీకి !

ప్రముఖ కన్నడ సాహితీవేత్తలు బరగూరు రామచంద్రప్ప, పాటిల్ పుట్టప్ప, చెన్నవీర కణవి, వీరభద్రప్పకు కర్ణాటక ప్రభుత్వం భద్రత కల్పించింది. ప్రోఫసర్ భగవాన్ కు భారీ భద్రత కల్పించారు. లింగాయిత్ ప్రత్యేక ధర్మం కోసం పోరాటం చేస్తున్న వినయ్ కులకర్ణికి పోలీసు భద్రత కల్పించారు.

Gowri murder impact Karnad Baraguru get Karnataka govt security

వీరితో పాటు రిటైడ్ ఐఏఎస్ అధికారి ఎస్ఎం. జామ్ ధార్, విధాన పరిషత్ సభ్యుడు బసవరాజ్ హోరట్టి, కర్ణాటక మంత్రి ఎంబీ. పాటిల్ తో సహ మొత్తం 17 మంది ప్రముఖలుకు భద్రత కల్పించాలని రాష్ట్ర హోం శాఖ అధికారులకు కర్ణాటక ప్రభుత్వం సూచించింది. సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి రాజరాజేశ్వరీ నగరలోని ఇంటి ఆవరణంలో గౌరీ లంకేష్ హత్యకు గురైన తరువాత కొన్ని సంఘ, సంస్థల నుంచి బెదిరింపులు ఉన్న ప్రముఖులకు కర్ణాటక ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసింది.

English summary
After veteran journalist Gauri Lankesh's murder, state government decides to give security to 17 high profile litterateurs and think tanks of Karnataka. This include noted writers Girish Karnad, Baraguru Ramachandrappa, Patil Puttappa etc
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X