షాక్: పెళ్ళైన కొద్దిసేపటికే వరుడు మృతి, ఎలాగంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఛంఢీఘడ్: పెళ్ళి వేడుకలో అత్యుత్సాహం పెళ్ళి కొడుకునే బలి తీసుకొంది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని కైథాల్ జిల్లా గుల్హా పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకొంది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

స్విట్జర్లాండ్‌లో నివసించే ఎన్నారై విక్రమ్ హర్యాణాలోని కైథాల్ జిల్లా గుల్హా పట్టణంలో శనివారం నాడు వివాహం చేసుకొన్నాడు. వివాహన్ని పురస్కరించుకొని రాత్రి పూట వేడుకలు నిర్వహించారు.

Groom dies in celebratory firing on wedding eve

వివాహం జరిగిందనే కారణంగా బంధువులు, కుటుంబసభ్యులు ఆనందాల్లో తేలియాడారు.డ్యాన్సుల్లో మునిగి తేలారు. అయితే ఈ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వరుడి బంధువు డ్యాన్స్ చేస్తూ తుపాకీని పదే పదే గాల్లోకి పేల్చాడు.

అయితే డ్యాన్స్ చేస్తున్నవారు తుపాకీ పేల్చే సమయంలో అతనికి తగలడంతో తుపాకీ గురి తప్పి వరుడికే తుపాకీ తూటా తగిలింది. దీంతో వెంటనే తేరుకొని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వరుడు విక్రమ్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. అత్యుత్సాహం వరుడు విక్రమ్ ప్రాణాలను కోల్పోయేలా చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Marriage celebrations turned into gloom when the bridegroom died during celebratory firing in the Guhla area of the district last night. Two of his friends, who are brothers, suffered injuries and were hospitalised.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి