వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేమి విచిత్రం: ధోతి, కుర్తా ధరిస్తే గొడవ, షెర్వాణీ వేసుకోవడంతో పరస్పరం దాడి..

|
Google Oneindia TeluguNews

పెళ్లి అంటే ఎన్నో కలలు.. ఊహాలు.. అయితే ఆచారాలు, సంప్రదాయాలు కంపల్సరీ.. దేశం భిన్నత్వంలో ఏకత్వం.. అన్నీ మతాలు, కులాలతో కలిసి ఉంటుంది. కానీ పురాతన ఆచారం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే మధ్యప్రదేశ్‌లో అయితే వరుడు, వధువు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఏం జరిగిందో మనము తెలుసుకుందాం. పదండి.

ధోతి కడితే రగడ..

ధోతి కడితే రగడ..


మధ్యప్రదేశ్ ధార్ జిల్లా మంగ్‌బేడ గ్రామంలో పెళ్లి కూతురు కుటుంబం అభ్యంతరం తెలిపింది. అయితే ఆచారం ప్రకారం వరుడు ధోతి, కుర్తా ధరించాలి.. కానీ అతడు షెర్వాణీ వేసుకున్నాడు. ఇంకేముంది పెళ్లి కూతురు తరఫు వారికి ఎక్కడో కాలింది. అభ్యంతరం తెలుపడంతో.. మెల్లగా ఘర్షణ జరిగింది. వరుడు స్వస్ధలం ధార్ జిల్లా.. షెర్వాణీ వేసుకోవడంతో వివాదం చెలరేగింది. వరుడు తరఫువారు ఒకరు ఉమ్మి వేయడం.. వధువు తరఫు వారు ఒకరు రాయి విసరడంతో గొడవ జరిగింది. దీంతో రెండు వర్గాలు కర్రలతో దాడికి దిగాయి. ఘటనలో నలుగురు గాయపడ్డారు. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.

పెళ్లి మాత్రం ఆగలే

పెళ్లి మాత్రం ఆగలే


ఇరు వర్గాలపై పోలీసులు 294, 323, 506, సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డ్రెస్సింగ్ విషయంలోనే గొడవ జరిగిందని వరుడు చెబుతున్నారు. రాళ్ల దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చాలా మంది దామోనోడ్ పోలీసు స్టేషన్‌కు భారీగా చేరుకన్నారు. అక్కడ వారు ఆందోళన చేశారు. అయితే తర్వాత ఇరు కుటుంబాలు ధార్ సిటీకి చేరుకున్నారు. తర్వాత పెళ్లి తంతు పూర్తి చేశారని వారి బంధువులు చెప్పారు. గొడవ జరిగిన పెళ్లి మాత్రం ఆగలేదు.. కానీ కొందరు తొందరపడటం వల్లే పచ్చని తోరణాల మధ్య నెత్తురు కారాల్సి వచ్చింది.

 షెర్వాణీ ధరిస్తే గొడవ

షెర్వాణీ ధరిస్తే గొడవ

షెర్వాణీ కోసం గొడవ జరగడం కలకలం రేపింది. డ్రెస్సింగ్ కోసం ఘర్షణ జరగడం ఏంటో అర్థం కావడం లేదని కొందరు అంటున్నారు. ఆ తర్వాతే ఉమ్మడం.. రాయి విసరడం జరిగాయి. కానీ తర్వాత ఇరు కుటుంబాలు కలిశాయి. కానీ కర్రలతో దాడి చేసుకోవడంతో.. పలువురు గాయపడ్డారు. మరీ డ్రెస్సు కోసం వారు ఇలా చేయడం ఏంటీ అని జనం అభిప్రాయపడుతున్నారు. పెళ్లి అంటే ఇద్దరు మనుషులు కలువాలి కానీ.. బట్టల కోసం ఏంటీ అని చెబుతున్నారు.

English summary
groom Sundarlal a resident of Dhar city, had shunned the indigenous tradition to wear a sherwani, which irked the bride's kin, triggering a spat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X