జీఎస్టీ వల్ల సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారులకు దెబ్బే: నష్టపోతారన్న చిదంబరం..
నిపుణులు తయారు చేసి ఇచ్చిన ముసాయిదా ప్రకారం.. ఈ జీఎస్టీ లేదని, దీనివల్ల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.
న్యూఢిల్లీ: కొంత ఆమోదం.. కొంత పెదవి విరుపులు.. కొంత వేచిచూసే ధోరణి.. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీపై ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం జీఎస్టీని అంత విశ్వసనీయమైనదిగా భావించడం లేదు. తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం జీఎస్టీ ప్రభావంతో బడుగు జీవులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

నిపుణులు తయారు చేసి ఇచ్చిన ముసాయిదా ప్రకారం.. ఈ జీఎస్టీ లేదని, దీనివల్ల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు భారీగా నష్టపోతారని అన్నారు. ఇండియాలో జీఎస్టీ అమలు అసాధ్యమని గతంలో బీజేపీనే చెప్పిందని ఈ సందర్భంగా చిదంబరం గుర్తుచేశారు. కాగా, శుక్రవారం అర్థరాత్రి 12గం. సమయంలో జీఎస్టీ లాంఛింగ్ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications