వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిన్నిస్ రికార్డుల్లో అయోధ్య.. సరికొత్త రికార్డుపై కన్నేసిన సీఎం యోగి.. భారీ రథయాత్రకు..

|
Google Oneindia TeluguNews

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దీపావళీ పండుగను ఘనంగా జరిపేందుకు ప్రత్యేక దృష్టిని సారించింది. రికార్డు స్థాయిలో దివ్వెలను వెలిగించి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నది. శనివారం ఈ అపూర్వ సంఘటనకు అయోధ్య వేదిక కానున్నది. ఈ కార్యక్రమం కోసం సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వ అధికారులను ఈ కార్యక్రమంలో నిమగ్నం చేసింది. ఇంతకు ఈ రికార్డు విశేషాలు ఏమిటంటే..

దీపాల కాంతుల్లో అయోధ్య

దీపాల కాంతుల్లో అయోధ్య

చారిత్రాత్మక నగరం అయోధ్య వివాదాలను పక్కన పెట్టి దీపం కాంతుల్లో వెలిగిపోనున్నది. ఈ పట్టణంలో సుమారు రూ.5.51 లక్షల దీపాలను వెలిగించే దీపోత్సవం అనే కార్యక్రమాన్ని సీఎం యోగి ప్రభుత్వం చేపట్టింది. ఆయోధ్యలోని సరయు ఘాట్‌లో దీపోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది.

రథంపై శ్రీ రాముడి ఊరేగింపు

ఇప్పటి వరకు లేని రికార్డును గిన్సీస్ బుక్‌ వరల్డ్ రికార్డ్‌లో లిఖిందుకు సీఎం యోగి ప్రభుత్వం ఏర్పాట్లలో మునిగిపోయింది. అధికారులను, ప్రజలను, పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున్న ఈ వేడుకలో భాగస్వామ్యం చేసింది. దీపావళీ పండుగ సందర్భంగా శ్రీరాముడుని రథంపై ఊరేగించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం కోసం వివిధ దేశాల నుంచి కళాకారులను ఆహ్వానించింది. నగరంలోని సాకేత్ కాలేజ్ నుంచి రాంకథ పార్క్ ఈ రధయాత్ర కొనసాగనుంది.

226 కోట్ల పథకాల ప్రకటన

226 కోట్ల పథకాల ప్రకటన

దీపావళి పండుగ సందర్భంగా ఆయోధ్యలో 5 లక్షలకుపైగా దీపాలను వెలిగించడంతోపాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నది. ఈ వేడుక నేపథ్యంలో రూ.226 కోట్ల విలువైన కొత్త పథకాలను ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. పలు ఆకర్షణీయమైన ప్రజా సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది.

అట్టహాసంగా వేడుకను

అట్టహాసంగా వేడుకను

ఆయోధ్యలోని సరయూ ఘాట్‌లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున్న జనాలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందిబెన్, ఫిజీ రిపబ్లిక్ డిప్యూటీ స్పీకర్ వీణా భట్నాగర్‌తోపాటు సీఎం ఆదిత్యానాథ్ హాజరుకానున్నారు. ఇంకా ఈ వేడుకలో పాల్గొనేందుకు మంత్రులు, శాసన సభ్యులు, అధికారులు, నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath's government is eyeing a Guinness world record. Governemnt made palns to illuminating 5.51 lakh diyas at the annual Diwali event 'Deepotsav' in Ayodhya on Saturday. The earthen lamps will be lit at Saryu Ghat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X